Home న్యూస్ పింక్ తమిళ్ రీమేక్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసిన వకీల్ సాబ్…మాస్…ఊరమాస్!

పింక్ తమిళ్ రీమేక్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసిన వకీల్ సాబ్…మాస్…ఊరమాస్!

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ కి ఆల్ మోస్ట్ 8 ఏళ్ల తర్వాత నికార్సయిన కంబ్యాక్ మూవీ గా నిలిచి సంచలనం సృష్టించింది, సినిమా కేవలం వారం లోనే పవన్ కళ్యాణ్ కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలవగా ఇప్పుడు టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షేర్ ని సాధించిన సినిమాలలో ఒకటిగా చేరడానికి సిద్ధం అవుతుంది.

Vakeel Saab 4 Days Total World Wide Collections

ఇక ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ పింక్ చాలా చిన్న సినిమా కాగా ఈ సినిమాను తమిళ్ లో అక్కడ స్టార్ హీరో అజిత్ కుమార్ రీమేక్ చేయగా అక్కడ కూడా సీరియస్ నోట్ తోనే సినిమా ఉన్నప్పటికీ అక్కడ సినిమా కి అజిత్ స్టార్ డం హెల్ప్ అవ్వడం తో లాంగ్ రన్ లో సాలిడ్ కలెక్షన్స్ ని సాధించింది.

సినిమాను అక్కడ 60 కోట్ల రేంజ్ లో అమ్మగా సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర 126.59 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుని మొత్తం మీద షేర్ పరంగా 69.5 కోట్ల దాకా అందుకుని మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.

తెలుగు కి వచ్చే సరికి సీరియస్ కథ కోర్టు వరకే ఉంచి మిగిలిన సీన్స్ లో పవన్ కళ్యాణ్ ని చాలా బాగా ప్రజెంట్ చేయడం తో తెలుగు వర్షన్ ఒక కమర్షియల్ మూవీ లానే అనిపించింది. సినిమా ఇప్పుడు అజిత్ నేర్కొండ పార్వై కలెక్షన్స్ ను కేవలం 8 రోజుల్లో….

Vakeel Saab 5 Days Total World Wide Collections

బ్రేక్ చేసి పింక్ రీమేక్స్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 8 రోజుల్లో అజిత్ మూవీ కలెక్షన్స్ ను బ్రేక్ చేసి ప్రజెంట్ 128 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న వకీల్ సాబ్ సినిమా లాంగ్ రన్ లో మరిన్ని అద్బుతాలు నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. మరి టోటల్ రన్ లో ఎంత దూరం వెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here