కోలివుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాలా డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు ఎక్కువగా పక్కా లోకల్ గా ఉంటాయి, రా రాస్టిక్ నేపధ్యంలో బాలా సినిమాలు స్పెషల్ అంటారు, అలాంటి బాలా ఎవరో బలవంతం చేసి డైరెక్షన్ చేయించారా అన్నట్లు చేసిన సినిమా వర్మా… తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ గా ముందు తెరకెక్కిన ఈ సినిమా ను బాలేదని ఆపేశారు. కానీ ఇప్పుడు రీసెంట్ గా సినిమా ను…..
సింప్లీ సౌత్ అనే యాప్ ఓవర్సీస్ లో వదిలేసిన ఈ సినిమాకి ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేసి కొని డైరెక్ట్ రిలీజ్ చేయగా ఇండియా లో నాలుగు లోకల్ యాప్స్ కి సినిమాను ఒక్కో రేటు కి అమ్మేశారు, మొత్తం మీద ఇండియా లో ఈ సినిమా 140 టికెట్ రేటు తో…
పే పెర్ వ్యూ పద్దతి లో రిలీజ్ అవ్వగా సినిమా చూసిన వారు అందరూ ఇదేం సినిమా రా బాబు అని తలలు పట్టుకున్నారు, అర్జున్ రెడ్డి ని కంప్లీట్ కమర్షియల్ మూవీ గా తీసినట్లు ఉండటం తో ఈ సినిమా ను ఆపేసి మంచి పని చేశారు అంటూ సోషల్ మీడియా లో….
ట్రోల్స్ కూడా ఎక్కువగానే జరగగా ఇక మొత్తం మీద మొదటి రోజు కి గాను సినిమా కి ఇండియా లో ఎన్ని యూనిక్ వచ్చాయి అన్నది ఆసక్తిగా మారగా ట్రేడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం 4 యాప్స్ లో కలిపి యావరేజ్ గా 11 వేల నుండి 12 వేల యూనిక్ వ్యూస్ దక్కాయని అంటున్నారు.
అంటే…ఒక టికెట్ 140 చొప్పున 12 వేల టికెట్ సేల్స్ జరిగి ఉంటే సినిమా కి మొత్తం మీద ఇండియా లో 16.8 లక్షల దాకా గ్రాస్ కలెక్షన్స్ వచ్చి ఉండొచ్చు అన్న మాట. మరి ఇవి ఎంతవరకు నిజం అన్నవి తెలియాల్సి ఉండగా ఓవరాల్ గా ఇండియా లో సినిమాకి మంచి ఓపెనింగ్స్ లభించాయి అని చెప్పొచ్చు.