విక్రం తనయుడు ధృవ్ విక్రం హీరోగా తెలుగు లో పాత్ బ్రేకింగ్ మూవీ గా నిలిచిన అర్జున్ రెడ్డి సినిమాను కోలివుడ్ లో డిఫెరెంట్ మూవీస్ తీసే డైరెక్టర్ బాలా డైరెక్షన్ లో రీమేక్ చేసిన సినిమా వర్మా… అర్జున్ రెడ్డి సినిమాను కంప్లీట్ గా కమర్షియల్ వర్షన్ గా మార్చి తీసినట్లు ఉన్న ఈ సినిమా కంప్లీట్ షూటింగ్ ని పూర్తీ చేసుకున్న తర్వాత రషెస్ చూసి విక్రం నచ్చక…
సినిమాను వద్దని వదిలేశాడు, మళ్ళీ అర్జున్ రెడ్డి ని మక్కికి మక్కీ దింపేసి ఆదిత్య వర్మా సినిమా చేసినప్పటికీ అది కూడా ఆశించిన మేర రీచ్ కాలేక పోయింది. ఇక వర్మా సినిమా ఎందుకని ఆపెశారో అని తెలుసుకోవాలని భావించారు… సినిమాను సింప్లీ సౌత్ యాప్ వాళ్ళు ఓవర్సీస్ లో రైట్స్ కొని…
డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయగా…. ఇండియాలో నాలుగు రీజనల్ యాప్స్ ఈ సినిమాను పే పెర్ వ్యూ పద్దతిలో 140 టికెట్ రేటు తో రిలీజ్ చేశారు… సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ చూసి ఈ సినిమాను ఆపేసే మంచి పని చేశారు అంటూ అందరూ ట్రోల్ చేశారు కూడా…
ట్రోల్స్ వచ్చినా…. సినిమా టాక్ కూడా నెగటివ్ గా ఉన్నా కానీ సినిమా కి మొదటి రోజు 12 వేల దాకా యూనిక్ వ్యూస్ దక్కగా 140 టికెట్ రేటు కి 16.8 లక్షల దాకా కలెక్షన్స్ దక్కగా ఇప్పుడు మొదటి వీకెండ్ కి గాను సినిమా మొత్తం మీద 28 వేల దాకా యూనిక్ వ్యూస్ దక్కినట్లు ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు…
మొదటి రోజు తో పోల్చితే సినిమాకి వీకెండ్ లో టాక్ నెగటివ్ గా ఉన్నా వ్యూస్ సాలిడ్ గానే దక్కాయి అని చెప్పాలి. ఇక ఈ వ్యూస్ ద్వారా సినిమా కి మొదటి వీకెండ్ కి 39.2 లక్షల దాకా కలెక్షన్స్ వచ్చి ఉంటాయని అంటున్నారు… సినిమా టాక్ కి ఈ కలెక్షన్స్ గొప్ప విషయం అనే చెప్పాలి…..