కెరీర్ ని అపజయాలతో మొదలు పెట్టినా తర్వాత స్ట్రాంగ్ హిట్స్ కొట్టిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చినా కానీ తొలి బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టడానికి కొంత టైం పట్టింది, 4 ఏళ్ల క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర వరుణ్ తేజ్ సాయి పల్లవి మరియు శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వచ్చిన ఫిదా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేయగా ఆ విజయం వరుణ్ తేజ్ కెరీర్ కి…
బిగ్గెస్ట్ బూస్టప్ ఇచ్చింది, తర్వాత తొలిప్రేమ, ఎఫ్ 2 మరియు గద్దలకొండ గణేష్ సినిమాలతో సాలిడ్ గా సాగుతూ ఉండగా గద్దలకొండ గణేష్ సినిమా కి వరుణ్ తేజ్ ఆల్ మోస్ట్ 7 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు తన రెమ్యునరేషన్…
అమాంతం పెంచేశాడు అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది, ఇప్పుడు తను చేస్తున్న బాక్సింగ్ మూవీ గనికి 9 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని అందుకోబోతున్న వరుణ్ తేజ్ తర్వాత ఇప్పుడు చేస్తున్న ఎఫ్ 2 సినిమా సీక్వెల్ ఎఫ్ 3 కోసం భారీ రెమ్యునరేషన్ ని తీసుకోబోతున్నాడట. లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ ప్రకారం ఈ సినిమా కోసం…
వరుణ్ తేజ్ ఏకంగా 11 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకోబోతున్నారని సమాచారం. సినిమా బడ్జెట్ కూడా మొత్తం మీద 70 కోట్లకు పైగా ఉండగా లీడ్ యాక్టర్స్ అలాగే డైరెక్టర్ కే సగం వరకు రెమ్యునరేషన్ వెళుతుందని అంటున్నారు, అందులో భాగంగా ఇప్పుడు వరుణ్ తేజ్ ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకోబోతున్నారని టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో చర్చలు…
గట్టిగా జరుగుతున్నాయి…. గని ఈ ఇయర్ ఎండ్ లోపు వచ్చే అవకాశం ఉండగా ఎఫ్ 3 సినిమా 2022 సంక్రాంతి కి ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాయి… ఈ రెండు కూడా విజయాలను సొంతం చేసుకుంటే వరుణ్ తేజ్ క్రేజ్ మరింతగా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.