మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ ఫిదా సినిమా తో సాలిడ్ టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు వరకు కెరీర్ చేసిన సినిమాల్లో కంచే ఒక్కటే మంచి మార్కులు సాధించగా తొలి కమర్షియల్ బ్లాక్ బస్టర్ మాత్రం ఫిదా తో సొంతం చేసుకున్న వరుణ్ తేజ్ తర్వాత తొలిప్రేమ మల్టీ స్టారర్ ఎఫ్ 2 మరియు గద్దల కొండ గణేష్ సినిమాలతో తన మార్కెట్ ని మరింత స్టేబుల్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.
ఇక ఇప్పుడు తన కెరీర్ లో మరో డిఫెరెంట్ రోల్ చేయబోతున్నాడు వరుణ్ తేజ్, గద్దల కొండ గణేష్ లో విలనిష్ రోల్ చేసిన వరుణ్ తేజ్ ఈ సారి పూర్తీ బాక్సింగ్ నేపధ్యంలో తన కొత్త సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే, కొత్త డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో…
తెరకెక్కుతున్న ఈ బాక్సింగ్ మూవీ డిసెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలు అవ్వగా ప్రస్తుతం లాక్ డౌన్ వలన షూటింగ్ ఆగిపోయింది. కాగా ఈ సినిమా లో కీలక మైన రోల్ లో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించబోతున్నట్లు సమాచారం. తెలుగు లో అడపా దడపా సినిమాలు చేసిన ఉపేంద్ర…
చివరగా 2015 లో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా తో తెలుగు లో కనిపించారు, తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు తెలుగు సినిమా చేయని ఉపేంద్ర ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమా కథ బాగా నచ్చడం తో సినిమాలో కీలక మైన రోల్ చేస్తున్నట్లు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు.
ఉపేంద్ర ని తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ సినిమా తెలుగు తో పాటు కన్నడ లో కూడా డబ్ అవుతుందేమో అన్న సందేహాలు ఇండస్ట్రీ లో నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ఈ ఇయర్ ఎండ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. వరుస హిట్స్ లో ఉన్న వరుణ్ తేజ్ ఈ సినిమా తో మరో హిట్ కొట్టే చాన్స్ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.