మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) ఫిదా సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న తర్వాత వరుస పెట్టి సినిమాలతో ఆడియన్స్ ముందుకు వస్తూ ఉండగా F2 సిరీస్ కాకుండా చేసిన సినిమాల్లో గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత చేసిన గని సినిమా మీద…
భారీ ఆశలు పెట్టుకున్నా కూడా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. టోటల్ రన్ లో ఆ సినిమా 26.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో కేవలం 4.75 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ఏకంగా 21.55 కోట్ల రేంజ్ లో లాస్ ను…
సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకోగా ఆ సినిమా తర్వాత ఇప్పుడు వరుణ్ తేజ్ ఆడియన్స్ ముందుకు తన కొత్త సినిమా గాండీవధారి అర్జున(Gandeevadhari Arjuna) సినిమాతో రావడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమా…
ఓవరాల్ గా క్వాలిటీ పరంగా బాగా ఇంప్రెస్ చేయగా ఎలాంటి బడ్జెట్ తో ఈ సినిమా రూపొందింది అన్నది ఆసక్తిగా మారగా ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ సినిమా టోటల్ బడ్జెట్ లెక్క 45-50 కోట్ల దాకా ఉందని అంటున్నారు. లాస్ట్ మూవీ భారీ డిసాస్టర్ అయినా కూడా ఈ రేంజ్ లో బడ్జెట్ అంటే…
చాలా ఎక్కువే అని చెప్పాలి….కానీ బడ్జెట్ లో చాలా మొత్తం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా రికవరీ అయ్యిందని అంటూ ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరుణ్ తేజ్ కి సోలో హీరోగా సాలిడ్ కంబ్యాక్ ను సొంతం అయ్యేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.