బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) వరుస పెట్టి ఎక్స్ పెరిమెంట్స్ చేస్తూ ఎదురుదెబ్బలు దక్కించుకుంటూ ఉండగా ఇప్పుడు మళ్ళీ తన లేటెస్ట్ మూవీ మట్కా(Matka Pre Release Business) తో ఆడియన్స్ ముందుకు తన లక్ ని పరీక్షించుకోబోతున్నాడు…
ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద పర్వాలేదు అనిపించేలా అంచనాలు ఏర్పడగా వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నా కూడా సినిమాకి వాల్యూ బిజినెస్ బాగానే జరిగింది…..తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 15 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న మట్కా మూవీ…
వరల్డ్ వైడ్ గా 17.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మినిమమ్ 18.50 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి…
మొత్తం మీద సినిమాతో వరుణ్ తేజ్ మంచి కంబ్యాక్ ను ఎక్స్ పెర్ట్ చేస్తూ ఉండగా, కంగువ లాంటివి బిగ్ పాన్ ఇండియా మూవీతో పోటిలో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది ఇప్పుడు….రీసెంట్ టైంలో వరుస ఫ్లాఫ్స్ తో ఉండటంతో…
ఆ ఇంపాక్ట్ కచ్చితంగా మట్కా మూవీ మీద ఉంటుంది. సినిమా రిలీజ్ అయ్యాక టాక్ ఆడియన్స్ నుండి బాగా వస్తే కచ్చితంగా లాంగ్ రన్ లో టార్గెట్ ను అందుకోవడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమాతో వరుణ్ తేజ్ ఎంతవరకు కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి…