బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక టైంలో మీడియం రేంజ్ హీరోలలో మంచి మార్కెట్ ను క్రేజ్ ను సొంతం చేసుకున్నా కూడా ఎక్స్ పెరిమెంట్స్ ని చేస్తూ తన మార్కెట్ ను పూర్తిగా డౌన్ ఫాల్ అయ్యేలా చేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ మట్కా(Matka Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా…
ఈ సినిమాతో ఎట్టి పరిస్థితులలో కూడా కంబ్యాక్ ను సొంతం చేసుకుంటానని వరుణ్ తేజ్ నమ్మినా కూడా ఈ సినిమా ఏమాత్రం అంచనాలను అయితే అందుకోలేక పోయింది. మొదటి ఆటకే ఎపిక్ డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ దశలో కూడా తేరుకోలేక పోయింది.
సినిమా కోసం ఆల్ మోస్ట్ 45 కోట్ల రేంజ్ లో బడ్జెట్ ను పెట్టి తీశారని టాక్ ఉండగా బడ్జెట్ పరంగా చెప్పాలి అంటే ఎపిక్ డిసాస్టర్ అనే రేంజ్ లో రిజల్ట్ ను సినిమా సొంతం చేసుకుంది….డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి తీసేస్తే అసలు షేర్ అనేది పెద్దగా ఉండే అవకాశం కూడా లేదు..
కానీ అవేవి తీయకుండా థియేట్రికల్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన కలెక్షన్స్ ని గమనిస్తే..
#Matka Movie Total WW Collections(Inc GST) Est.
👉Nizam – 51L~
👉Total AP – 70L~
Total AP-TG:- 1.21CR(2.60CR~ Gross)
👉KA+ROI+OS – 15L~
Total WW Collections:- 1.36CR(3.00CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన ఫైనల్ కలెక్షన్స్ లెక్కలు….
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 18.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ తీయకుండా సాధించిన కలెక్షన్స్ ని తీసేశాక ఇంకా 17 కోట్లకు పైగా లాస్ ను అందుకుని ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది.