మీడియం రేంజ్ హీరోలలో మంచి సక్సెస్ లతో ఒక స్టేజ్ లో మంచి మార్కెట్ ను సొంతం చేసుకున్న హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) ఒకరు…ఫిదా, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్ లాంటి మూవీస్ తన మార్కెట్ ను సొంతం చేసుకున్న వరుణ్ తేజ్ తర్వాత మాత్రం వరుస పెట్టి సినిమాలు చేసినా ఏవి కూడా…
ఆడియన్స్ అంచనాలను అయితే అందుకోలేక పోయాయి అనే చెప్పాలి. ఇక రీసెంట్ టైంలో చేసిన 3 సినిమాలు కూడా సింగిల్ డిజిట్ కలెక్షన్స్ తోనే సరిపెట్టుకుని తీవ్రంగా నిరాశ పరిచాయి. ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా నిలుస్తాడు అనుకున్నా ఇప్పుడు కనీస ఓపెనింగ్స్ ను అందుకోలేక పోయిన వరుణ్ తేజ్…
అప్ కమింగ్ మూవీస్ తో కమర్షియల్ ఎలిమెంట్స్ కచ్చితంగా ఉండేలా చూసుకుని ఎలాగైనా కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి వరుణ్ తేజ్ నటించిన రీసెంట్ మూవీస్ టోటల్ రన్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
#VarunTej Last 5 Movies Collections(Solo)
👉#OperationValentine – 3.53CR*****
👉#GandeevadhariArjuna – 1.51CR
👉#Ghani – 4.75CR
👉#GaddalakondaGanesh – 24.81Cr
👉#Antariksham9000KMPH – 8.6Cr
Total Last 5 Movies collections: 43.20Cr*
Average 1 Movie Collections: 8.64Cr
ఇవీ వరుణ్ తేజ్ నటించిన రీసెంట్ మూవీస్ టోటల్ కలెక్షన్స్ లెక్క…లాస్ట్ 5 సినిమాల టోటల్ కలెక్షన్స్ 43.2 కోట్ల మార్క్ ని మాత్రమే అందుకోగా యావరేజ్ గా ఒక్కో సినిమాకి ఇప్పుడు 8.64 కోట్ల రేంజ్ లో షేర్ మాత్రమే వస్తున్నాయని చెప్పొచ్చు. ఇక వరుణ్ తేజ్ అప్ కమింగ్ మూవీస్ తో ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి ఇక….