బాక్స్ ఆఫీస్ దగ్గర SR కళ్యాణ మండపంతో హిట్ కొట్టినా తర్వాత చేసిన సినిమాలతో మాత్రం నిరాశ కలిగించే రిజల్ట్ లను సొంతం చేసుకుంటూ వచ్చిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస పెట్టి సినిమా అవకాశాలను మాత్రం సొంతం చేసుకుంటూ ఉండగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు లేటెస్ట్ గా వినరో భాగ్యము విష్ణు కథ అంటూ డిఫెరెంట్ టైటిల్ తో వస్తున్నాడు. టీసర్ ట్రైలర్ లు పర్వాలేదు అనిపించే రేంజ్ లో..
బజ్ ని క్రియేట్ చేయగా టీం యూనిక్ ప్రమోషన్స్ ని జరపగా అందులో కొన్ని వర్కౌట్ అయ్యాయి, కొన్ని వికటించాయి. అయినా ఎంతో కొంత బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ వాళ్ళు ఓన్ గానే రిలీజ్ చేస్తూ ఉండగా మొత్తం మీద సినిమా…
తెలుగు రాష్ట్రాల వాల్యూ బిజినెస్ రేంజ్ అటూ ఇటూగా 3.60 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 4 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సాధించి ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా.. ఈ లెక్కన సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర….
క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మినిమమ్ 4.50 కోట్ల రేంజ్ లో అయినా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమాకి ఆడియన్స్ నుండి డీసెంట్ టాక్ కనుక సొంతం అయితే శివరాత్రి వీకెండ్ లో సినిమా డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.