Home న్యూస్ బుట్టబొమ్మ సినిమా ఇందుకే ఫ్లాఫ్ అయింది అంటున్న నిర్మాత!!

బుట్టబొమ్మ సినిమా ఇందుకే ఫ్లాఫ్ అయింది అంటున్న నిర్మాత!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన నోటబుల్ మూవీస్ లో బుట్టబొమ్మ సినిమా ఒకటి…సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కప్పేల సినిమా తెలుగు రీమేక్ గా తెరకెక్కింది. కాగా ఈ సినిమా రిలీజ్ ఎప్పటికప్పుడు లేట్ అవుతూ రాగా రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా కి టాక్ ఏమాత్రం కలిసి రాలేదు… 

బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఏమాత్రం ఇంపాక్ట్ చూపించ లేక పోయిన ఈ సినిమా ఫ్లాఫ్ గా మిగిలిపోయింది. ఈ సినిమా పరాజయంపై సినిమా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ కప్పేల 2020 టైంలో రాగా అప్పుడే మేం…

రీమేక్ రైట్స్ ను తీసుకున్నాం, కానీ తర్వాత కోవిడ్ రావడంతో అందరికీ అన్ని సినిమాలు అందుబాటులో ఉండటంతో ఆడియన్స్ అభిరుచి ఇప్పుడు(2023) టైంకి పూర్తిగా మారిపోయింది. ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందు తాను అలాగే త్రివిక్రమ్ గారు కలిసి చూశామని….

ప్రస్తుతం ఉన్న ఆడియన్స్ టేస్ట్ కి ఈ సినిమా నచ్చే అవకాశం లేదని అప్పుడే అనిపించింది అని, ఇప్పుడు అదే నిజం అయిందని చెప్పుకొచ్చారు… సినిమాలో ముందు రోల్స్ కూడా విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ లాంటి వాళ్ళని అనుకున్నా తర్వాత ఆప్షన్స్ మారాయని చెప్పుకొచ్చారు. ఓవరాల్ గా సినిమా రిజల్ట్ మేం ఊహించినట్లే వచ్చిందని ఒప్పుకున్నారు నిర్మాత…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here