టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్ లో అల్టిమేట్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిన సినిమా మన్మథుడు, అలాంటి సినిమా కి సీక్వెల్ తీయడమే సాహసం అయితే, ఆ సీక్వెల్ లో అడల్ట్ కంటెంట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని భయబ్రాంతులను చేశాడు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. మొదటి సినిమా ను నమ్మి ఆ టైటిల్ తో వచ్చిన రెండో పార్ట్ ని థియేటర్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఫుల్ ఫ్యామిలీ తో చూడలేక పోయారు.
అదే సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎదురుదెబ్బ కొట్టి కేవలం 10 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించి భారీ డిసాస్టర్ అయ్యేలా చేసింది, అలాంటి డిసాస్టర్ సినిమా ని స్టార్ మా వారు ఏకంగా 8.3 కోట్ల రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ హక్కులను సొంతం చేసుకున్నారు.
8.3 కోట్ల రేటు అంటే ఆల్ మోస్ట్ స్టార్ హీరోల సినిమాల రేటు తో సమానం అనే చెప్పాలి, దాంతో సినిమా కి ఎలాంటి TRP రేటింగ్ దక్కుతుంది అన్నది ఆసక్తి గా మారగా సినిమా తొలిసారిగా రీసెంట్ గా ఛానెల్ లో టెలికాస్ట్ చేశారు. ఫలితం సినిమా TRP రేటింగ్ డిసాస్టర్ అనిపించుకుంది.
సినిమా కి మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు దక్కిన TRP రేటింగ్ 7.61 మాత్రమె… రీసెంట్ కొన్ని బిగ్ మూవీస్ తో పోల్చుకుంటే ఇది ఓ మాదిరి TRP రేటింగ్ అనే చెప్పాలి కానీ సినిమా బ్రాండ్ కి ఆ సినిమా ని కొన్న రేటు తో చూసుకుంటే మాత్రం ఇది డిసాస్టర్ TRP రేటింగ్ అనే చెప్పాలి.
ఇక కింగ్ నాగార్జున ఈ సినిమా రిజల్ట్ దెబ్బ కొట్టడం తో కొత్త సినిమా ను మొదలు పెట్టడానికి కొంత సమయం తీసుకుంటున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే తన కెరీర్ బెస్ట్ హిట్ అయిన సోగ్గాడే సినిమా సీక్వెల్ బంగార్రాజు నే మొదలు పెట్టె అవకాశం ఎక్కువగా ఉందీ అనేది ఇండస్ట్రీ వినిపిస్తున్న టాక్.