బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ జైలర్(Jailer Movie) తో అంచనాలను మించే రేంజ్ లో ఊచకోత కోసిన కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేట్టయన్(Vettaiyan Movie) గ్రాండ్ గా భారీ ఎత్తున రిలీజ్ ను సొంతం చేసుకుంది. ముందుగా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకి ఫస్ట్ టాక్ కూడా బయటికి వచ్చేసింది…
కథ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ సీరియస్ క్రైమ్స్ చేసి తప్పించుకునే చెడ్డవాళ్లకి న్యాయబద్ధమైన శిక్ష పదాలని చూసే అమితాబ్ బచ్చన్ ఒకవైపు, మరో వైపు అన్యాయం జరిగితే అది హద్దులు దాటిపోయింది అనిపిస్తే ఎన్ కౌంటర్ చేయడానికి సిద్ధం అయ్యే పోలిస్ అయిన…
హీరో ఒకవైపు నిలుస్తారు…ఇలాంటి వీళ్ళకి ఒక సీరియస్ కేసు ఒకటి సవాలుగా మారుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే….ఫస్టాఫ్ స్టార్ట్ అవ్వడం కొంచం స్లో గా స్టార్ట్ అయినా రజినీ ఎంట్రీ నుండి సినిమా ఫ్లో అలా అలా పెరుగుతూ…
అసలు కథ పాయింట్ కి వచ్చిన తర్వాత సీరియస్ టర్న్ తీసుకుని కథ ఆసక్తిగానే సాగుతూ ఫస్టాఫ్ పర్వాలేదు బాగుంది అనిపించగా ఎక్స్ లెంట్ ఇంటర్వెల్ ఎపిసోడ్ తర్వాత సెకెండ్ ఆఫ్ కథ ఆసక్తిగా స్టార్ట్ అయ్యి కొన్ని సీన్స్ రిపీటివ్ గా అనిపిస్తూ కొద్దిగా డ్రాగ్ అయినా కూడా…
మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుండి ఆకట్టుకుంటూ సాగి ఓవరాల్ గా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ లు ఆకట్టుకునేలా ముగిసి సినిమా ఎండ్ అయ్యే టైంకి పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించేలా మెప్పిస్తుంది అని చెప్పొచ్చు…రజినీ హీరోయిజం, ఎలివేషన్ లు…
అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్ మరోసారి హైలెట్ అవ్వడంతో ఫ్యాన్స్ కోరుకునే స్టఫ్ తో పాటు సీరియస్ సబ్జెక్ట్ కూడా ఉన్నప్పటికీ రెగ్యులర్ ఆడియన్స్ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న దానిపై సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది అన్నది చెప్పగలం. ఓవరాల్ గా ఫస్టాఫ్ ఎబో యావరేజ్ గా…
సెకెండ్ ఆఫ్ యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించగా సినిమా కూడా ఎబో యావరేజ్ లెవల్ కి అటూ ఇటూగా అనిపించింది….జైలర్ తో కంపేర్ చేసి చూస్తె కొంచం హై తగ్గినా కంటెంట్ బాగానే ఉండటంతో ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపించడం ఖాయమని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా కి ప్రీమియర్స్ తర్వాత…
పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ వస్తూ ఉండటంతో ఇదే రేంజ్ లో రెస్పాన్స్ రెగ్యులర్ షోల నుండి కూడా సొంతం చేసుకుంటే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రజినీకాంత్ మాస్ రాంపెజ్ ను దసరా సెలవుల్లో చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.