సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నుండి లాస్ట్ ఇయర్ జైలర్(Jailer Movie) లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ తర్వాత ఆడియన్స్ ముందుకు జై భీమ్ లాంటి అవార్డ్ విన్నింగ్ మూవీ తీసిన డైరెక్టర్ జ్ఞానవేల్ డైరెక్షన్ లో చేసిన లేటెస్ట్ మూవీ వేట్టయన్(Vettaiyan Movie Review and Rating) సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…
కథ పాయింట్ కి వస్తే సూపర్ పోలిస్ అయిన రజినీకాంత్ అన్యాయం జరిగితే ఎప్పుడూ న్యాయం వైపే ఉంటాడు, పరిస్థితిని బట్టి క్రిమినల్స్ ని ఎన్ కౌంటర్ చేయడానికి కూడా వెనకాడదు, మరో పక్క న్యాయ బద్దంగానే అపరాదులకు శిక్ష పడాలని చూసే అమితాబ్ బచ్చన్ కి రజినీ చేసే పని నచ్చదు…
అలాంటి ఈ ఇద్దరి మధ్య ఒక కేసు నిమిత్తం జరిగిన పరిణామాలే వేట్టయన్ మూవీ, ఇతర పాత్రల గురించి అసలు ట్విస్ట్ ల గురించి తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే…. పెర్ఫార్మెన్స్ పరంగా మరోసారి రజినీ దుమ్ము దులిపేశాడు… ఫస్ట్ 25-30 నిమిషాల ఎపిసోడ్ లో రజినీ మాస్ రాంపెజ్ ఆకట్టుకోగా…
తర్వాత హీరోయిజం కొంచం తగ్గి కథ సీరియస్ టోన్ తో సాగుతుంది, ఓవరాల్ గా రజినీ మరోసారి తన మాస్ స్వాగ్ తో అదరగొట్టేశాడు, ఇక అమితాబ్ రోల్ పరంగా ఆకట్టుకోగా రజినీ అమితాబ్ ల సీన్స్ బాగా వచ్చాయి. ఇక ఫహాద్ ఫాజిల్ రోల్ మొదట్లో ఎందుకు ఒప్పుకున్నాడో అనిపించినా సెకెండ్ లో కీలక సీన్స్ పడటంతో పర్వాలేదు అనిపించగా…రానా రోల్ కూడా ఓకే అనిపించింది కానీ ఆ రోల్ ని …
ఇంకా స్ట్రాంగ్ గా చూపించి ఉండాల్సింది అని పించింది, ఇక మంజు వారియర్ ఓకే అనిపించగా రితిక మరియు ఇతర యాక్టర్స్ కూడా పర్వాలేదు అనిపించారు…సంగీతం పరంగా 2 సాంగ్స్ అనిరుద్ అదరగొట్టేశాడు, బ్యాగ్రౌండ్ స్కోర్ మరీ జైలర్ రేంజ్ లో లేదు కానీ పర్వాలేదు అనిపిస్తుంది…
ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ బాగుంది అనిపించగా సెకెండ్ ఆఫ్ కథ మరీ సీరియస్ టర్న్ తో ఫ్లో మిస్ అయింది అనిపిస్తూ క్లైమాక్స్ పర్వాలేదు అనిపించింది, సెకెండ్ ఆఫ్ పై మరింత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది… ఇక డైరెక్టర్ జ్ఞానవేల్ జై భీమ్ రేంజ్ లో మెప్పించలేదు కానీ…
ఉన్నంతలో పర్వాలేదు అనిపించే ఔట్ పుట్ ఇచ్చాడు అని చెప్పాలి. ఫస్టాఫ్ వరకు ఫుల్ మార్కులు పడినా సెకెండ్ ఆఫ్ విషయంలో మరింత శ్రద్ధ చూపించి ఉంటే బాగుండేది…కానీ కథ ఈజీగా గెస్ చేసేలా ఉండటం, ట్విస్ట్ లు కూడా ఆడియన్స్ కి తెలిసిపోయేలా ఉండటం లాంటివి డ్రా బ్యాక్స్. దానికి తోడూ లెంత్ కూడా కొంచం ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగింది…
ఓవరాల్ గా రజినీకాంత్ నుండి ఆడియన్స్ మళ్ళీ జైలర్ లాంటి ఔట్ ను ఎక్స్ పెర్ట్ చేసి వెళతారు కానీ సినిమా ఫస్టాఫ్ వరకు అలానే ఉన్నప్పటికీ సెకెండ్ ఆఫ్ కొంచం టోన్ తగ్గింది. ఓవరాల్ గా సినిమా అయ్యే సరికి ఎబో యావరేజ్ లెవల్ లో పర్వాలేదు ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపించేలా సినిమా ఉంటుంది… ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్…