Home న్యూస్ విజయ్ 9 డేస్ 12 గంటలు…ఎన్టీఆర్ 8 డేస్ 8 గంటలు….ఊచకోత అంటే ఇది!!

విజయ్ 9 డేస్ 12 గంటలు…ఎన్టీఆర్ 8 డేస్ 8 గంటలు….ఊచకోత అంటే ఇది!!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి కొత్త సినిమా గురించిన అప్ డేట్ కోసం 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ సినిమా లో ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ రిలీజ్ అవ్వడం తో ఫ్యాన్స్ భారీ రికార్డులతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమం లో ఓల్డ్ రికార్డులు అన్నీ కూడా బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతూ ఉండగా టాలీవుడ్ తరుపున ఇప్పటికే….

ఈ ఇంట్రో టీసర్ హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గానే కాకుండా మొట్ట మొదటి 1 మిలియన్ లైక్స్ మార్క్ ని అందుకున్న టీసర్ గా నిలిచింది, ఫాస్టెస్ట్ 25 మిలియన్ వ్యూస్ మార్క్ ని కూడా అందుకున్న టీసర్ గా నిలిచీ సంచలనం సృష్టించిన ఈ టీసర్…

ఈ విషయం లో టాలీవుడ్ పరంగానే కాకుండా సౌత్ లో కూడా ఫాస్టెస్ట్ 25 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని రికార్డ్ అందుకోగా… ఇప్పుడు 26 మిలియన్ మార్క్ ని కూడా ఫాస్టెస్ట్ గా అందుకుని స్ట్రాంగ్ హోల్డ్ ని కంటిన్యు చేస్తూ దూసుకు పోతుండటం విశేషం అనే చెప్పాలి.

ఇది వరకు విజయ్ సర్కార్ టీసర్ కి 26 మిలియన్స్ ని అందుకోవడానికి 9 రోజుల 12 గంటల టైం పట్టిందట. 2 ఏళ్ల నుండి ఈ రికార్డ్ ఇలానే ఉండగా టాలీవుడ్ తరుపున సరిలేరు నీకెవ్వరు టీసర్ ఒక్కటి కొంచం దగ్గరగా వచ్చినా 12 రోజులకి ఈ రికార్డ్ ను అందుకోగలిగింది… కానీ ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ మాత్రం….

8 రోజుల మీద 8 గంటల టైం మాత్రమె తీసుకుని ఫాస్టెస్ట్ 26 మిలియన్ వ్యూస్ మార్క్ ని సొంతం చేసుకుని దూసుకు పోతూ ఉండటం తో సౌత్ లో ఫాస్టెస్ట్ 26 మిలియన్ వ్యూస్ రికార్డ్ ను నమోదు చేసింది, విజయ్ మాస్టర్ టీసర్ త్వరలోనే వస్తుంది అంటూ ఉండటం, మన దగ్గర వకీల్ సాబ్ టీసర్ కూడా సిద్ధం అవుతూ ఉండటంతో వాటిలో ఏవి ఈ రికార్డ్ ను బ్రేక్ చేస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here