Home న్యూస్ రికార్డుల రారాజు విజయ్ క్రేజ్ తగ్గిందా….వీటికి ఈ రెస్పాన్స్ ఏంటి సామి!

రికార్డుల రారాజు విజయ్ క్రేజ్ తగ్గిందా….వీటికి ఈ రెస్పాన్స్ ఏంటి సామి!

0

సౌత్ ఇండస్ట్రీ మొత్తం మీద సూపర్ ఫామ్ లో ఉన్న హీరోలలో ముందు నిలిచే హీరో దళపతి విజయ్(Thalapathy Vijay), ప్రస్తుతం కెరీర్ లోనే బెస్ట్ ఫామ్ లో ఉన్న విజయ్ నుండి వచ్చిన ఏ సినిమా కూడా రీసెంట్ టైంలో యునానిమస్ టాక్ రాకపోయినా కూడా ప్రతీ సినిమాతో తన రేంజ్ ని పెంచుకున్నాడు.

ఇక యూట్యూబ్ లో విజయ్ సినిమాల టీసర్ లు, ట్రైలర్ లు, సాంగ్స్ వస్తే ఇక వాటికి 24 గంటల్లో నమోదు అయ్యే రికార్డుల జాతర మరో లెవల్ లో ఉంటూ వస్తూ ఉండగా లేటెస్ట్ గా తన పుట్టిన రోజు జరగగా ఇప్పుడు తను నటిస్తున్న కొత్త సినిమా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie) మూవీ నుండి…

ఒక బర్త్ డే స్పెషల్ గ్లిమ్స్ అలాగే సినిమా నుండి రెండో సాంగ్ ను రిలీజ్ చేశారు. మామూలు టైంలో వచ్చే అప్ డేట్స్ కే రికార్డులు పెట్టె ఫ్యాన్స్ ఇప్పుడు ఏకంగా విజయ్ పుట్టిన రోజు టైంలో వచ్చిన అప్ డేట్స్ కి ఆల్ టైం రికార్డులు పెడతారు అని అనుకున్నా కూడా…

బర్త్ డే స్పెషల్ గ్లిమ్స్ కి 24 గంటల్లో 7.45 మిలియన్ వ్యూస్ మాత్రమే సొంతం అవ్వగా 485K లైక్స్ మార్క్ ని మాత్రమే సొంతం చేసుకుంది. ఇక సినిమా నుండి వచ్చిన రెండో సాంగ్ చిన్న చిన్న కంగల్ పాటను స్వయంగా విజయే పాడినా కూడా 24 గంటల్లో 4.5 మిలియన్ వరకు వ్యూస్…

520K రేంజ్ లో లైక్స్ మాత్రమే సొంతం అయ్యాయి. రీసెంట్ టైంలో విజయ్ నటించిన మూవీస్ లో ఇవే వీకేస్ట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న వీడియోలు అని చెప్పాలి. యూట్యూబ్ లో రికార్డుల రారాజుగా పేరున్న విజయ్ కొత్త సినిమాకి అనుకున్న రేంజ్ లో బజ్ లేదు కానీ మరీ ఇంత తక్కువ రెస్పాన్స్ ను మాత్రం ఎవ్వరూ ఊహించలేదు…ఇక సినిమా సెప్టెంబర్ 5న ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here