Home TRP రేటింగ్ 6 ఏళ్ల క్రితం మూవీ…80 లక్షల రేటు…TRP రేటింగ్ కుమ్మేసింది!

6 ఏళ్ల క్రితం మూవీ…80 లక్షల రేటు…TRP రేటింగ్ కుమ్మేసింది!

0

కోలివుడ్ హీరోల్లో తెలుగు లో మార్కెట్ ఎక్స్ పాన్షన్ చేసుకుంటున్న హీరోల్లో ఫుల్ జోష్ మీద ఉన్న హీరో ఇలయ దళపతి విజయ్ అని చెప్పాలి. ఎప్పటి నుండో ఇక్కడ మార్కెట్ ని పెంచుకోవడానికి ట్రై చేసినా కుదరలేదు కానీ విజయ్ రీసెంట్ మూవీస్ అన్నీ కూడా తెలుగు లో మంచి పెర్ఫార్మెన్స్ ని కనబరచి ఇప్పుడు స్టడీ మార్కెట్ దక్కేలా చేశాయి. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు విజయ్ నటిస్తున్న సినిమాల…

టెలివిజన్ రేటింగ్స్ మీద కూడా సాలిడ్ గా పడుతుంది అని చెప్పాలి. లేటెస్ట్ మూవీ విజిల్ తెలుగు లో రిపీట్స్ లో కూడా మంచి రేటింగ్ లను సొంతం చేసుకోగా. 4 ఏళ్ల క్రితం వచ్చిన పోలీసోడు సినిమా రీసెంట్ గా టెలికాస్ట్ అయ్యి సాలిడ్ రేటింగ్ ను దక్కించుకుని సత్తా చాటుకుంది.

ఇక లేటెస్ట్ గా 6 ఏళ్ల క్రితం విజయ్ మరియు కేరళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ల కాంబినేషన్ లో రూపొందిన మల్టీ స్టారర్ జిల్లా సినిమా మంచి విజయాన్ని నమోదు చేయగా తెలుగు లో ఆలస్యంగా డబ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా డీసెంట్ కలెక్షన్స్ ని సాధించి విజయ్ మార్కెట్ పెరిగడానికి ఉపయోగపడింది.

అలాంటి సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వడానికి చాలా టైం నే తీసుకోగా రీసెంట్ గా స్టార్ మా ఛానెల్ ఈ సినిమాను 80 లక్షల రేటు కి శాటిలైట్ రైట్స్ ని దక్కించుకుని ఛానెల్ లో రీసెంట్ గా టెలికాస్ట్ చేయగా సినిమా కి ఫస్ట్ టైం టెలికాస్ట్ చేసిన తర్వాత 5.5 రేటింగ్ ను సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. 6 ఏళ్ల క్రితం సినిమా అయినా కానీ టెలివిజన్ లో మాత్రం…

సినిమాకి పెట్టిన రేటు కి అల్టిమేట్ రేటింగ్ ను సొంతం చేసుకుని సత్తా చాటుకుంది ఈ సినిమా. రీసెంట్ టైం లో కొన్ని బిగ్ తెలుగు మూవీస్ ప్రీమియర్స్ కి కూడా ఇలాంటి రేటింగ్ దక్కడం అదే టైం లో 6 ఏళ్ల క్రితం సినిమాకి ఈ రేటింగ్ రావడం విశేషం అనే చెప్పాలి. ఇక మాస్టర్ సినిమాతో ఇక్కడ విజయ్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here