బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస విజయాలతో దూసుకు పోతున్న కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్నాడని చెప్పొచ్చు. లాస్ట్ మూడు సినిమా లు ఒకదాన్ని మించి ఒకటి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలుగా నమోదు అవ్వగా… అన్నీ కూడా కోలివుడ్ ఇండస్ట్రీ లో సరికొత్త రికార్డ్ తో ఊచకోత కోసింది. లాస్ట్ ఇయర్ వచ్చిన బిగిల్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా…
300 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ సినిమా తరువాత తక్కువ టైం లోనే విజయ్ నటించిన కొత్త సినిమా మాస్టర్ ప్రేక్షకుల ముందుకు ఆల్ మోస్ట్ వచ్చినట్లే వచ్చి ఆగిపోయింది.
దానికి కారణం ప్రస్తుతం ఉన్న లాక్ దౌన్ ఎఫెక్ట్, ఏప్రిల్ 9 నే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా లాక్ దౌన్ వలన పోస్ట్ పోన్ అవ్వగా సినిమా బడ్జెట్ అండ్ బిజినెస్ రేంజ్ ఇప్పుడు రివీల్ అయ్యాయి. సినిమా ను సుమారు 95 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందించారని కోలివుడ్ ఇండస్ట్రీ లో టాక్ ఉంది.
ఇది పాత మూవీ బిగిల్ తో పోల్చితే 60 నుండి 70 కోట్లు తక్కువే అని చెప్పాలి. దానికి కారణం ఇందులో బిగిల్ లో లా మరీ భారీ సెట్టింగ్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ వాడలేదట, అండ్ స్టార్ కాస్ట్ కూడా తక్కువ అవ్వడం తో ప్రస్తుతం విజయ్ మార్కెట్ దృశ్యా తక్కువ బడ్జెట్ తోనే సినిమా రూపొందింది అని చెప్పొచ్చు.
ఇక సినిమా లాక్ డౌన్ వలన ఆగిపోయే సమయానికి ఈ సినిమా కి 120 కోట్ల నుండి 130 కోట్ల రేంజ్ బిజినెస్ జరిగేదని టాక్. కానీ లాక్ డౌన్ వలన ఇప్పుడు అంత బిజినెస్ కి ఛాన్స్ తక్కువ ఉండటం తో మంచి డేట్ చూసుకుని ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలని చూస్తున్నారు. మరి కొత్త బిజినెస్ ఎంతవరకు అవుతుందో చూడాలి…