Home గాసిప్స్ హాట్రిక్ కన్ఫాం…కాచుకోండి ఇక!!

హాట్రిక్ కన్ఫాం…కాచుకోండి ఇక!!

0
-advertisement-

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ మళ్ళీ జోరు అందుకున్నాడు… కెరీర్ మొదలు పెట్టడం హాట్రిక్ విజయాలతో మొదలు పెట్టాడు సాయి ధరం తేజ్, రేయ్ డిలే అవ్వడం తో పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మరియు సుప్రీమ్ సినిమాలతో దుమ్ము లేపి సినిమా సినిమా కి తన మార్కెట్ ని పెంచుకున్న సాయి ధరం తేజ్ సుప్రీమ్ సినిమా తో ఆల్ మోస్ట్ 25 కోట్ల రేంజ్ షేర్ ని అందుకుని దుమ్ము లేపాడు.

-advertisement-

-advertisement-

కానీ తర్వాత ఒక్కసారిగా ఫాం కోల్పోయిన మెగా మేనల్లుడు ఒకటికి మించి ఒకటి ఫ్లాఫ్స్ ని ఎదురుకుంటు ఏకంగా డబుల్ హాట్రిక్ ఫ్లాఫ్స్ ని కూడా కంప్లీట్ చేశాడు, తన మార్కెట్ ఆల్ మోస్ట్ డెడ్ ఎండ్ టైం కి వస్తుందేమో అనుకున్న టైం లో…

-advertisement-

-advertisement-

-advertisement-

చిత్రలహరి సినిమా తో మంచి కంబ్యాక్ ని సొంతం చేసుకున్న సాయి ధరం తేజ్, లాస్ట్ ఇయర్ ఎండ్ లో ప్రతీ రోజూ పండగే సినిమా తో కెరీర్ బెస్ట్ హిట్ ని సొంతం చేసుకుని తిరిగి సూపర్ ఫాం ని అందుకున్నాడు. ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటర్ అంటూ రాబోతున్నాడు…

-advertisement-

ఈ సినిమా లాక్ డౌన్ లేకుండా ఉంటె ఈ పాటికే రిలీజ్ అవ్వాల్సింది కానీ ఇప్పుడు పోస్ట్ పోన్ అవ్వగా ఈ సినిమా ఇన్ సైడ్ వర్గాల నుండి అందుతున్న టాక్ ప్రకారం సినిమా సాలిడ్ గా వచ్చిందని అంటున్నారు, ఎంటర్ టైన్ మెంట్ అండ్ సాంగ్స్ సినిమాకి ప్రధాన బలమని అంటున్నారు.

కచ్చితంగా సాయి ధరం తేజ్ కి సినిమా మరో హిట్ అయ్యే అవకాశం పక్కా గా ఉందని చెబుతుండటం తో ఇది నిజమైతే మరో హాట్రిక్ ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని చెప్పొచ్చు. ఈ సినిమా లాక్ డౌన్ తర్వాత ఆగస్టు ఎండ్ లో కానీ సెప్టెంబర్లో కానీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here