తెలుగు లో ఈ ఇయర్ ఉప్పెన సినిమాలో నెగటివ్ రోల్ తో మంచి పాపులారిటీ ని సొంతం చేసుకున్న కోలివుడ్ హీరో విజయ్ సేతుపతి అంతకుముందే సైరా సినిమాలో స్పెషల్ రోల్ లో మెప్పించినా కానీ ఎక్కువ గుర్తింపు ఉప్పెన సినిమా తో సొంతం అయింది అని చెప్పాలి. ఈ సినిమా అల్టిమేట్ హిట్ తర్వాత విజయ్ సేతుపతి సినిమాలు చాలా వరకు తెలుగు లో డబ్ అవ్వడం స్టార్ట్ అవ్వగా…
ఎక్కువగా ఓల్డ్ మూవీస్ డబ్ అయ్యి రిలీజ్ ను సొంతం చేసుకుంటూ ఉండగా వాటిలో ఇప్పుడు మొదటి సారి థియేటర్స్ లో తమిళ్ మరియు తెలుగు లో ఒకే టైం లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న సినిమాగా విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ లాభం సినిమా నిలవనుంది…
విజయ్ సేతుపతి కి జోడిగా శృతి హాసన్ నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు విలన్ రోల్ లో నటించబోతుండగా ఈ సినిమా ను 9 న తమిళ్ తో పాటు తెలుగు లో ఒకే టైం లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు లో ఈ సినిమా థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే….
నైజాం లో 110 థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ లో 130 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 240 థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఇక సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 80 లక్షల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుందని సమాచారం…
దాంతో సినిమా ఇప్పుడు తెలుగు లో హిట్ అవ్వాలి అంటే మినిమం ఒక కోటి షేర్ ని అయినా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా అయితేనే తెలుగు లో హిట్ అవుతుంది. పెద్దగా బజ్ ఏమి లేక పోయినా కానీ ఒకవేళ హిట్ టాక్ వస్తే జనాలు ఎంతో కొంత థియేటర్స్ కి వెళ్లి సినిమాను చూసే అవకాశం ఉంది. మరి కోటి రికవరీ అవుతుందో లేదో చూడాలి ఇక.