Home గాసిప్స్ విజయ్ విజిల్ బడ్జెట్ షాక్…కోలివుడ్ లో ఆల్ టైం టాప్ 2!!

విజయ్ విజిల్ బడ్జెట్ షాక్…కోలివుడ్ లో ఆల్ టైం టాప్ 2!!

0

     కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. నాన్ స్టాప్ హిట్స్ తో దూసుకు పోతున్న విజయ్, మెర్సల్ మరియు సర్కార్ విజయాలతో యమ స్పీడ్ మీదున్న టైం లో ఇప్పుడు అట్లీ డైరెక్షన్ లో చేస్తున్న లేటెస్ట్ మూవీ బిగిల్ ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలను పెంచుతుండగా సినిమా పై తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి బజ్ ఏర్పడింది అని చెప్పొచ్చు.

రీసెంట్ గా రిలీజ్ అయిన తెలుగు వర్షన్ విజిల్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుండగా విజువల్స్ అండ్ టేకింగ్ ఓ రేంజ్ లో ఉన్నాయని ప్రతీ ఒక్కరు మెచ్చుకుంటున్నారు. ఇక సినిమా ఆ టేకింగ్ అండ్ గ్రాండియర్ ని చూసి సినిమా కి ఎంత బడ్జెట్ పెట్టి ఉంటారు అన్నది ఆసక్తిగా మారగా…

కోలివుడ్ ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం కోలివుడ్ ఇండస్ట్రీ లోనే ఈ సినిమా ఆల్ టైం టాప్ 2 బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందించిన సినిమా గా చెప్పుకుంటున్నారు. సినిమా కి ఆల్ మోస్ట్ 180 కోట్ల రేంజ్ లో బడ్జెట్ అయిందని వారు చెబుతున్నారు. విజువల్స్ అండ్ గ్రాండియర్ అద్బుతంగా ఉండటం ఆ బడ్జెట్ నిజమే నెమో అనిపిస్తుంది.

కోలివుడ్ లో రోబో 2 కి 550 కోట్ల బడ్జెట్ పెట్టగా ఐ సినిమా కి 160 కోట్లు, రోబో 1 కి 100 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు. అవన్నీ ఎక్స్ పెరిమెంటల్ మూవీస్ కాగా ఇప్పుడు విజయ్ చేస్తున్న విజిల్ సినిమా స్పోర్ట్స్ బ్యాగ్ డ్రాప్ తో తెరకెక్కుతున్న సినిమా నే అయినా..

పక్కా కమర్షియల్ మూవీ అని చెబుతున్నారు. ఇందులో విజయ్ మూడు డిఫెరెంట్ రోల్స్ లో నటించబోతున్నాడు. ఈ దీపావళి కి సినిమా ఇక్కడ కూడా రిలీజ్ కాబోతుంది, తెలుగు సినిమాలు ఏవి అప్పుడు రిలీజ్ లేనందున విజయ్ సినిమా కి ఇక్కడ అల్టిమేట్ అడ్వాంటేజ్ అనే చెప్పాలి. టాక్ బాగుంటే కచ్చితంగా మంచి వసూళ్లు సినిమా ఇక్కడ సాధించే అవకాశం ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here