టాలీవుడ్ లో మార్కెట్ ఉన్న ఇతర ఇండస్ట్రీ హీరోలలో సీనియర్ అయిన కమల్ హాసన్ కి తెలుగు లో ఒకప్పుడు సక్సెస్ లు దక్కాయి కానీ అనుకున్న రేంజ్ విజయాలు మాత్రం దక్కలేదు, భారతీయుడు సినిమా తప్పితే భారీ హిట్ సొంతం అవ్వలేదు, కానీ దశావతారం, విశ్వరూపం లాంటి సినిమాలు పర్వాలేదు అనిపించినా హిట్ గా అయితే నిలవలేదు… కానీ ఇప్పుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ విక్రమ్ బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఏకంగా 25 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. సినిమా తెలుగు లో ఆల్ మోస్ట్ పెట్టిన అమౌంట్ కి డబుల్ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది అని చెప్పాలి ఇప్పుడు…
13 రోజులు పూర్తీ అయ్యే టైం కి విక్రమ్ మూవీ తెలుగు రాష్ట్రాలలో 14.42 కోట్ల షేర్ ని 25.11 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా 7.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 6.92 కోట్ల లాభంతో ఆల్ మోస్ట్ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది, సినిమా హోల్డ్ చూస్తుంటే మూడో వీకెండ్ లో కూడా దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…