Home TRP రేటింగ్ అక్కడ డిసాస్టరే..కానీ ఇక్కడ బ్లాక్ బస్టర్..8వ సారి షాకింగ్ TRP!!

అక్కడ డిసాస్టరే..కానీ ఇక్కడ బ్లాక్ బస్టర్..8వ సారి షాకింగ్ TRP!!

0

కొన్ని కొన్ని సార్లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అయిన సినిమా లు కూడా వెండితెరపై సెన్సేషనల్ TRP రేటింగ్స్ తో దుమ్ము లేపుతూ ఉంటాయి, ఇది వరకు వెండి తెరపై క్లాస్ మూవీస్ అనిపించుకున్న సినిమాలే ఇలాంటి స్టడీ TRP రేటింగ్ ని టెలివిజన్ లో సొంతం చేసుకునేవి కానీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అనిపించుకున్న సినిమా బుల్లి తెరపై మాత్రం అల్టిమేట్ TRP రేటింగ్ తో….

సెన్సేషనల్ రన్ ని దక్కించుకుని అందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఆ సినిమానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో తెరకెక్కిన వినయ విధేయ రామ. బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక ఫ్లాఫ్ అయిన ఈ సినిమా…

సినిమా లో కొన్ని సీన్స్ కారణంగా కూడా భారీ గా ట్రోల్ అయింది… అయినా కానీ ఇవేవి సినిమా టెలివిజన్ TRP రేటింగ్స్ విషయం లో మాత్రం ఇసుమంత కూడా ప్రభావం చూపలేక పోయాయి సరికదా లాంగ్ రన్ లో సాలిడ్ TRP రేటింగ్ లు రావడానికి ఉపయోగ పడ్డాయి అని చెప్పొచ్చు.

కాగా లేటెస్ట్ గా 8 వ సారి టెలికాస్ట్ అయిన ఈ సినిమా కి మళ్ళీ దుమ్ము లేపే TRP రేటింగ్ దక్కింది. ఒకసారి టెలికాస్ట్ అయిన అన్ని సార్లు TRP రేటింగ్ ని గమనిస్తే…
👉1st time – 7.9 TRP
👉2nd time – 8.2 TRP
👉3rd time – 8.16TRP
👉4th time – 7.2 TRP
👉5th time – 8.18 TRP
👉6th time – 5.19 TRP
👉7th time – 6.35 TRP
👉8th time – 7.97 TRP

ఇదీ సినిమా లాంగ్ రన్ లో టెలివిజన్ లో సాధించిన TRP రేటింగ్ లు… చూస్తుంటే ఇంతలా ఆదరించడానికి రీజన్స్ ఏంటనేది ఎవ్వరికీ అంతుపట్టడం లేదు, రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా మించే రేంజ్ లో ఈ సినిమా అద్బుతమైన TRP రేటింగ్ లతో దూసుకు పోతూనే ఉంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here