Home న్యూస్ అంత పోటి లో 24 ఏంటి సామి…అరాచకం అసలు!

అంత పోటి లో 24 ఏంటి సామి…అరాచకం అసలు!

0

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ పై ట్రేడ్ లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే… వీరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా అవ్వడం తో అంచనాలు పీక్స్ లో పెరిగి పోగా డానికి తోడూ మెగా పవర్ స్టార్ రీసెంట్ మూవీ రంగస్థలం హిస్టారికల్ ఇండస్ట్రీ హిట్ అవ్వడం తో క్రేజ్ మరింత పెరిగి పోయింది. అదే కారణం తో సంక్రాంతి పోటి ఎంత గట్టిగా ఉన్నా కానీ…

వినయ విధేయ రామ సినిమా కి బిజినెస్ అల్టిమేట్ లెవల్ లో జరుగుతుంది అని చెప్పాలి. అన్ని ఏరియాలలో ఒకెత్తు అయితే నైజాం లో ఎంత పోటి ఉన్నా కానీ ఈ సినిమా కి ఏకంగా 24 కోట్ల రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.

ఈ రేంజ్ వసూళ్లు అందుకోవడం సోలో రిలీజ్ అయితే టాక్ వస్తే ఈజీ నే అని చెప్పాలి. కానీ అంత పోటి లో ఈ మార్క్ ని అందుకోవడం కొంచం కష్టంగానే కనిపిస్తున్నా రంగస్థలం తో 29 కోట్ల షేర్ అందుతున్న రామ్ చరణ్ ఈ సారి కూడా మ్యాజిక్ చేయడం ఖాయమని అంతా నమ్ముతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here