Home గాసిప్స్ వామ్మో 340 అట….కాచుకోండి ఇక!!

వామ్మో 340 అట….కాచుకోండి ఇక!!

0

  సంక్రాంతి కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న సినిమా వినయ విదేయ రామ. రంగస్థలం లాంటి హిస్టారికల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న సినిమా అవ్వడం తో ఈ సినిమా పై క్రేజ్ ఓ రేంజ్ లో ఉందని చెప్పాలి. ఇక సినిమా భారీ రిలీజ్ ని కూడా సొంతం చేసుకోవడం పక్కా గా కనిపిస్తుంది.

ముందుగా ఓవర్సీస్ లో సినిమా లోకేషన్స్ కౌంట్ అందరికీ ఒకింత షాక్ ని కలిగిస్తుంది. ఈ సినిమా టోటల్ ఓవర్సీస్ లో ఏకంగా 340 లోకేషన్స్ లో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ఇది రామ్ చరణ్ కెరీర్ లోనే కాదు టాలీవుడ్ హిస్టరీ లో కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీజ్ లలో ఒకటి.

ఇక సినిమా మాస్ మూవీ అవ్వడం తో ఓవర్సీస్ లో ఎలాంటి ప్రదర్శన ని దక్కించుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది. బోయపాటి కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క 1 మిలియన్ మూవీ కూడా లేదు. రంగస్థలం తో నాన్ బాహుబలి రికార్డ్ అక్కడ కూడా కొట్టిన రామ్ చరణ్ ఈ మాస్ మూవీ తో ఓవర్శిస్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here