బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సినిమా ఫ్లాఫ్ ఎఫెక్ట్ ఇంకో సినిమా పై పడటం అన్నది జరుగుతూ ఉంటుంది, ఇండస్ట్రీలో ఇంటర్ లింక్స్ ఉంటాయి కాబట్టి ఒక సినిమా వలన వచ్చిన నష్టాలు ఇంకో సినిమా టైం లో పూడ్చడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా విషయంలో ఇదే జరిగే అవకాశం కనిపిస్తుందని లేటెస్ట్ గా ట్రేడ్ లో టాక్ వినిపిస్తుంది ఇప్పుడు…
వివరాలలోకి వెళితే…రామారావ్ ఆన్ డ్యూటీ సినిమాను నిర్మించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ వాళ్ళే ఇది వరకు సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళతో కలిసి విరాట పర్వంని నిర్మించగా ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి భారీ నష్టాలనే సొంతం చేసుకుని కొన్న వాళ్ళకి లాస్ ని మిగిలించింది.
దాంతో ఆ సినిమా కి వచ్చిన నష్టాలను రామారావ్ ఆన్ డ్యూటీ సినిమాతో సాధ్యం అయినంత వరకు పూడ్చడానికి ట్రై చేస్తామని నిర్మాతలు బయ్యర్స్ కి చెప్పారని ట్రేడ్ లో టాక్ వినిపిస్తుంది. ఇదే కనుక నిజం అయితే రామారావ్ ఆన్ డ్యూటీ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.