Home గాసిప్స్ 35 కోట్ల సినిమా….45 కోట్లు అనుకుంటే ఇదే ఫైనల్ అంటున్నారు!

35 కోట్ల సినిమా….45 కోట్లు అనుకుంటే ఇదే ఫైనల్ అంటున్నారు!

0

డిక్టేటివ్, అభిమన్యుడు, పందెం కోడి 2 లాంటి బాక్ టు బాక్ హిట్స్ తో తెలుగు లో ఆల్ మోస్ట్ కోల్పోయిన మార్కెట్ ని తిరిగి సొంతం చేసుకున్న విశాల్ మళ్ళీ తర్వాత వరుస ఫ్లాఫ్స్ ని ఎదురుకున్నాడు, టెంపర్ రీమేక్ అయోగ్య మరియు భారీ లెవల్ లో రూపొందిన యాక్షన్ మూవీస్ రెండూ కూడా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా నష్టాలను మిగిలించగా ఇప్పుడు తన ఆశలను లేటెస్ట్ గా చేస్తున్న…

చక్ర సినిమా మీదే పెట్టుకోగా ఈ సినిమా ను ముందు థియేటర్స్ రిలీజ్ అనుకున్నా కానీ బెటర్ ఆఫర్ వస్తే డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయాలనీ నిర్ణయం తీసుకోగా సినిమా ను ఓవరాల్ గా 35 కోట్ల రేంజ్ బడ్జెట్ తో లావిష్ గా చిత్రీకరించగా సినిమా కి 45 కోట్ల రేంజ్ రేటు వస్తే…

అన్ని భాషల్లో కలిపి డిజిటల్ రిలీజ్ చేయడనికి సిద్దం అంటూ చెప్పినప్పటికీ… ఎవ్వరూ ముందుకు రాలేదు, తర్వాత తమకి తోచిన ఆఫర్స్ ఇస్తూ వచ్చిన OTT యాప్స్ లో జీ 5 వాళ్ళు సినిమా కి 32 కోట్ల దాకా రేటు ఇవ్వడానికి ముందుకు వచ్చారాని సమాచారం.

కానీ నిర్మాతలు ఆ రేటు తో సంతోష పడలేదట… కనీసం 40 కోట్ల రేంజ్ రేటు ఇవ్వాలని చెప్పగా ఆ రేటు ఇవ్వలేమని చెప్పేశారట వాళ్ళు. ఫైనల్ ఆఫర్ కింద అన్ని భాషల్లో కలిపి 34 కోట్ల నుండి 35 కోట్ల రేంజ్ రేటు కి మేం సిద్ధం అని చెప్పారట. ఇదే రేంజ్ రేటు ని అమెజాన్ ప్రైమ్ కూడా ఆఫర్ చేశారని టాక్ ఉంది.

దాంతో ఇప్పుడు యూనిట్ ఈ రెండు ప్లాట్ ఫామ్స్ లో ఎదో ఒకటి ఎంచుకుంటారా లేక ఇంకా బెటర్ ఆఫర్ కోసం ఎదురు చూస్తారా అన్నది తెలియాల్సి ఉంది, సినిమా కి పెట్టిన బడ్జెట్ ఈ రేటు తో రికవరీ కానుండగా శాటిలైట్ రైట్స్ అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ తో నిర్మాత ప్రాఫిట్స్ తెచ్చుకునే అవకాశం ఉంది, మరి ఫైనల్ నిర్ణయం ఏం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here