Home గాసిప్స్ వకీల్ సాబ్ Vs KGF2..దీన్ని మించే రచ్చ ఉండదు!

వకీల్ సాబ్ Vs KGF2..దీన్ని మించే రచ్చ ఉండదు!

0

ఈ ఏడాది ఇక సినిమాలు రిలీజ్ అవుతాయా అన్నది ఇంకా అను మానమే… ఒకవేళ అయినా జనాలు వస్తారా, కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయా అన్నది క్లారిటీ లేకుండా పోగా… ఇప్పుడు ఎక్కువ శాతం జనాల దృష్టి సంక్రాంతి పై పడింది. సంక్రాంతి కి పరిస్థితులు పూర్తిగా సద్దుకుంటాయి అని కాదు కానీ జనాలు ఇప్పటికే కరోనా ని లైట్ తీసుకుని అన్ని చోట్లా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళుతున్నారు కాబట్టి…

థియేటర్స్ దసరా టైం కి ఓపెన్ చేస్తే అప్పటి నుండి మెల్లి మెల్లిగా అక్కడం వెళ్ళడం కూడా అలవాటు అవుతుంది, దాంతో సంక్రాంతి కి పరిస్థితులు మెరుగు అవ్వడం ఖాయమని చెప్పాలి, అందుకోసమే ఇప్పుడు షూటింగ్ చివరి దశలో ఉన్న సినిమాలు సంక్రాంతి ని టార్గెట్ చేస్తున్నాయి.

వాటిలో కొన్ని మీడియం రేంజ్ మూవీస్ ఉండగా ఇప్పుడు ఓ రెండు బిగ్ మూవీస్ పోటి కి సిద్ధం అవుతున్నాయి అన్నది టాలీవుడ్ టాక్. ఇండియా వైడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ గా ఎదురు చూస్తున్న KGF2 షూటింగ్ కొంచమే బాలెన్స్ ఉండగా సంజయ్ దత్ షూటింగ్ నవంబర్ లో జరగబోతుంది, దాంతో ఇయర్ ఎండ్ కి సినిమా కంప్లీట్ అయ్యి…

సంక్రాంతి బరిలో నిలవబోతుందని సమాచారం. ఇక తెలుగు లో ఆల్ మోస్ట్ మూడేళ్ళ కి కంబ్యాక్ ఇవ్వబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సారి కంటెంట్ ఉన్న వకీల్ సాబ్ తో సంక్రాంతి కి సందడి చేయడం ఖాయంగా కనిపిస్తుంది. నవంబర్ కల్లా సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందని అంటున్నారు… దాంతో సంక్రాంతి రేసు లో సినిమా ఎంటర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇక రేసులో లవ్ స్టొరీ, గోపీచంద్ సీటి మార్ లు కూడా ఉన్నాయి, తమిళ్ బిగ్గీ మాస్టర్ కూడా సంక్రాంతి కి సిద్ధం అవుతుండగా తెలుగు లో మట్టుకు పోటి తీవ్రంగా ఉండేది మాత్రం వకీల్ సాబ్ మరియు KGF2 మధ్య అని చెప్పాలి. మరి ఇది జరగాలి అంటే పరిస్థితులు సద్దుకోవాలి, థియేటర్స్ రీ ఓపెన్ అవ్వాలి, జనాలు థియేటర్స్ కి వెళ్ళాలి… ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి జరుగుతే సంక్రాంతి కి రచ్చ పీక్స్ లో ఉండటం ఖాయం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here