డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో పాటు కమర్షియల్ మూవీస్ ని కూడా క్రమం తప్పకుండా చేసే హీరోల్లో విశాల్ కూడా ఒకరు, తమిళ్ తో పాటు తెలుగు లో కూడా సినిమాలను ఎప్పటికప్పుడు రిలీజ్ చేసే విశాల్ కి అడపా దడపా హిట్లతో పాటు గట్టిగా ఫ్లాఫ్స్ కూడా పడ్డాయి. రీసెంట్ గా కొన్ని మంచి విజయాల తర్వాత తమిళ్ అండ్ తెలుగు రెండు చోట్ల కూడా భారీ గా రిలీజ్ అయిన…
యాక్షన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడింది. సినిమా సుమారు 45 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందగా భారీ నష్టాలను సొంతం చేసుకుని డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకోగా ఈ సినిమా రిలీజ్ టైం లో బడ్జెట్ ఎక్కువ అవ్వడం తో నిర్మాతలకు….
విశాల్ కచ్చితంగా థియేటర్స్ లో సినిమా 25 కోట్లకు తగ్గని షేర్ సాధిస్తుందని మాట ఇచ్చినప్పటికీ అలా జరగలేదు, దాంతో విశాల్ కొత్త సినిమా కోసం ఆగిన యాక్షన్ నిర్మాతలు ఇప్పుడు విశాల్ నటించిన చక్ర సినిమా డైరెక్ట్ రిలీజ్ అవుతున్న వేల రిలీజ్ ను ఆపాలి అని కోర్టులో కేసు వేసి…
8 కోట్లు కడితేనే సినిమా రిలీజ్ అవ్వనివ్వాలి అని కోరారు. దీనిపై చర్చిన కోర్టు రిలీజ్ అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు, ఇన్ని రోజులు ఎం చేశారు అంటూ చెప్పి సినిమా రిలీజ్ కి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా తీర్పు ఇచ్చింది, దాంతో యాక్షన్ సినిమా వలన నష్టాల పాలు అయిన నిర్మాతకి మరోసారి షాక్ తగిలినట్లు అయ్యింది.
ఇక విశాల్ చక్ర సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతుండగా నిర్మాతలు ఎక్కువగానే ఎక్స్ పెర్ట్ చేసినా కానీ సినిమా కి రేటు కొంచం తక్కువగానే దక్కుతున్నా డైరెక్ట్ రిలీజ్ కి మొగ్గు చూపుతున్నారు, ఇప్పుడు తీర్పు కూడా అనుకూలంగా రావడం తో త్వరలోనే సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది…