Home న్యూస్ ఒరేయ్ బుజ్జిగా రివ్యూ…రాజ్ తరుణ్ కి భారీ షాక్ ఇది!

ఒరేయ్ బుజ్జిగా రివ్యూ…రాజ్ తరుణ్ కి భారీ షాక్ ఇది!

7

మంచి టాలెంట్ ఉన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో సరైన విజయాలు లేక మార్కెట్ పూర్తిగా కోల్పోయిన హీరోలలో రాజ్ తరుణ్ ఒకరు, వరుస విజయాలతో కెరీర్ ని మొదలు పెట్టినా తర్వాత ఒకటి తర్వాత ఒకటి పూర్తిగా ఫ్లాఫ్ మూవీస్ తో కెరీర్ లూ ఆల్ టైం లో స్టేజ్ లో ఉన్న రాజ్ తరుణ్ గుండెజారి గల్లంతైందే, ఒక లైలా కోసం ఫేం విజయ్ కుమార్ కొండా….

 డైరెక్షన్ లో చేసిన ఒరేయ్ బుజ్జిగా నేడు డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేసుకుంది, మాళవిక నాయర్, హేబ్బా పటేల్ జంటగా నటించిన ఈ సినిమా ఆహా వీడియో లో రిలీజ్ అవ్వగా సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ఆకట్టుకుంది అన్న విశేషాలను తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే… ఒకే ఊరికి చెందిన హీరో హీరోయిన్స్ ఇద్దరూ తమ తమ పెళ్లి గోల వలన ఇంట్లో నుండి పారిపోతారు… కానీ ఒకే సమయం లో పారిపోవడం తో ఇద్దరూ కలిసి పారిపోయారు అనే ప్రచారం జరుగుతుంది, తర్వాత ఒకరికొకరు తెలియకుండానే ప్రేమలో పడతారు వీరు….

తర్వాత ఏమైంది… ఇద్దరూ ఎలా కలిశారు, లాంటి విశేషాలు అన్ని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కథ పాయింట్ ఎంత సింపుల్ గా ఉందో సినిమా అంతకంటే సింపుల్ నరేషన్ తో తెరకెక్కింది, అసలు ఏమాత్రం సింక్ లేని సన్నివేశాలు ఒకటి తర్వాత ఒకటి… సినిమా ఎండ్ వరకు వస్తూ వెళుతూ ఉంటాయి…

ఇక యాక్టర్స్ అందరూ కూడా తెగ నటించేస్తూ ఉంటారు కానీ ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉండదు, ఇక సీన్స్ కి ఏమాత్రం సింక్ లేకుండా బ్యాగ్రౌండ్ స్కోర్ ఉంటుంది, ట్రైలర్ లోనే బ్యాగ్రౌండ్ స్కోర్ తేడా కొట్టింది అని డౌట్ రాగా ఇక్కడ సినిమా మొత్తం రాంగ్ టైమింగ్ లో వస్తూ ఉంటుంది బ్యాగ్రౌండ్ స్కోర్…

ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఏమాత్రం ఆకట్టుకోలేదు…. సినిమా లెంత్ కూడా చాలా ఎక్కువ అయిన ఫీలింగ్ కలుగుతుంది…. సంగీతం పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ఏమాత్రం సింక్ లేని విధంగా ఇబ్బంది పెడుతుంది.

ఇలాంటి సినిమా కి రాజ్ తరుణ్ మాళవిక నాయర్ ఉన్నంతలో తమ నటనతో మెప్పించే ప్రయత్నం చేసినా కథ లో దమ్ము లేక పోవడం తో అసలు ఎలివేట్ అవ్వనే లేదని చెప్పాలి… ఇక మిగిలిన యాక్టర్స్ కూడా నటించడానికి ఏమాత్రం స్కోప్ లేదనిపించింది…

ఇక డైరెక్షన్ పరంగా కొండా విజయ్ కుమార్ ఇది వరకు చేసిన గుండెజారి గల్లంతైందే, ఒక లైలా కోసం సినిమా లు చూసి ఈ సినిమా చూస్తె ఆ డైరెక్టరేనా ఈ సినిమా చేసింది అని అనుకోవడం ఖాయం… గత 2 సినిమాల్లో వాడిన మెయిన్ పాయింట్ నే ఇందులో నూ వాడినా… ఏమాత్రం కన్విన్సింగ్ గా ఆడియన్స్ ని మెప్పించలేక పోయాడు…

మొత్తం మీద సినిమాలో హైలెట్స్ కోసం వెతుక్కున్నా ఒకటి రెండుకి మించి చెప్పలేని పరిస్థితి… కామెడీ ఎంటర్ టైనర్ అయినా అసలు కామెడీ ఆడియన్స్ కి ఎక్కేలా లేక పొతే అది ఎంటర్ టైనరె కాదు… ఇక మైనస్ ల గురించి ఇప్పటికే అనేకం వచ్చాయి….

ఇకా చెప్పుకుంటూ పొతే మరిన్ని మైనస్ పాయింట్స్ వెతికెంత లెవల్ లో సినిమాలో ఉన్నాయి. ఓవరాల్ గా రొటీన్ మూవీస్ ఇష్టపడే వారు కూడా ఒకసారి కంప్లీట్ గా చూడాలి అంటే కష్టపడాల్సి ఉంటుంది, మొత్తం మీద సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.25 స్టార్స్…

7 COMMENTS

  1. Negative review rayataniki neeku entha ichharu raa….siggu vundali…oka manchi family entertainer ni ila anataniki… it’s a very good movie, full fun and family entertainer.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here