వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నా కూడా కెరీర్ లో ఏ సినిమాకి చేయని భారీ సాహసాన్ని మంచు విష్ణు(Manchu Vishnu) ఇప్పుడు చేస్తున్నాడు, కెరీర్ లో ఏ సినిమాకి లేని రేంజ్ లో ఏకంగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో కన్నప్ప(Kannappa Movie) ని రూపొందిస్తూ ఉండగా…..రీసెంట్ గా మహాశివరాత్రి పర్వదినాన “కన్నప్ప” ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. కన్నప్పగా విష్ణు మంచు అందరినీ ఆకట్టుకునేలా ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మంచు విష్ణు లుక్ పూర్తిగా రివీల్ అవ్వలేదు కానీ సైడ్ లుక్ అయితే బాగానే ఆకట్టుకుంది.”కన్నప్ప” భారీ బడ్జెట్ తో దృశ్యం కావ్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక ధైర్యవంతుడైన యోధుడు, శివుని భక్తుడైన కన్నప్ప కథను తెరపైకి తీసుకొస్తున్నారు. కన్నప్ప అచంచలమైన విశ్వాసం తరతరాలుగా అందరిలోనూ స్ఫూర్తిని నింపుతూ ఉంటుంది.
బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టైం గా భారీ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మంచు విష్ణుకి ఈ సినిమా విజయం చాలా కీలకంగా మారగా ఇతర ఇండస్ట్రీల టాప్ స్టార్స్ తో పాటు ఇక్కడ పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించబోతున్న విషయం తెలిసిందే….
కన్నప్పపై డీసెంట్ అంచనాలు ఉండగా.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మరింత బజ్ పెరిగింది. ఈ సినిమాలో మోహన్ లాల్, ప్రభాస్, శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే… మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాతో మంచు విష్ణు ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.