Home న్యూస్ భీమా 1st డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్….గోపీచంద్ మాస్!!

భీమా 1st డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్….గోపీచంద్ మాస్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాచో స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ భీమా(Bhimaa Movie 1st Day Box Office Collections Update)….రీసెంట్ గా రిలీజ్ అవ్వగా గోపీచంద్ ఊరమాస్ రోల్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అవుతూ ఉండగా ఓవరాల్ గా సినిమాకి పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ ఉంది…

ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా ఏమి జోరు చూపించలేదు కానీ సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పరంగా ఇప్పటికీ గోపీచంద్ కి మార్కెట్ ఉందని రుజువు చేస్తూ సాలిడ్ గా థియేటర్స్ లోకి జనాలు వస్తున్నారు, మాస్ సెంటర్స్ లో సినిమాకి మంచి ఓపెనింగ్స్ కనిపిస్తూ ఉండగా….

ఏ సెంటర్స్ లో మాత్రం బుకింగ్స్ అంతంత మాత్రమే ఉన్నాయి, ఓవరాల్ గా చూసుకుంటే మొదటి రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ లో సినిమా ఇప్పుడు మొదటి రోజున 1.2 కోట్ల రేంజ్ నుండి అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 1.5 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉంది.

ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే ఈ లెక్క ఇంకా పెరిగవచ్చు, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 1.8 కోట్ల రేంజ్ నుండి కుదిరితే 2 కోట్ల లోపు షేర్ ని అందుకోవచ్చు, మొత్తం మీద వరుస ఫ్లాఫ్స్ తో కూడా గోపీచంద్ కి మాస్ సెంటర్స్ లో మంచి క్రేజ్ ఉందని భీమా మరోసారి నిరూపిస్తుంది…. 

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదే జోరుని వీకెండ్ మొత్తం కొనసాగిస్తే సినిమా బిజినెస్ లో చాలా మొత్తం వెనక్కి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇక మొదటి రోజుకి గాను సినిమా సాధించే అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్క ఇదే రేంజ్ లో ఉంటాయో లేక ఇంతకుమించి వస్తాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here