ఇప్పటి వరకు కేవలం 4 సినిమాలు మాత్రమె చేసిన హీరో విశ్వక్ సేన్… బాక్స్ ఆఫీస్ దగ్గర వెల్లిపోమాకే తో ఎంట్రీ ఇచ్చినా ఆడియన్స్ ని అలరించలేక పోయింది, తర్వాత ఈ నగరానికి ఏమైంది… రిలీజ్ అయినప్పుడు కన్నా తర్వాత ఎక్కువ పాపులర్ అవ్వగా లాస్ట్ ఇయర్ ఫలక్నుమా దాస్ తో తొలి కమర్షియల్ హిట్ కొట్టిన విశ్వక్ సేన్… ఈ ఇయర్ ఫిబ్రవరి లో హిట్ ఫస్ట్ కేస్ మూవీ తో…
మరో హిట్ ని తన ఖాతాలో వేసుకోగా… ఇప్పుడు తన అప్ కమింగ్ ఏదని ఇంకా మొదలు అయితే పెట్టలేదు… కొత్త కథలతో పాటు రీమేక్ ఆఫర్స్ కూడా వస్తుండగా భారీ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన PVP నిర్మాణంలో తెరకెక్కుతున్న అప్ కమింగ్ మూవీ లో ఛాన్స్ దక్కిందని టాక్.
తమిళ్ లో రీసెంట్ గా సూపర్ హిట్ అయిన ఓమై కడవులే సినిమా ను తెలుగులో రీమేక్ చేయాలని ఫిక్స్ అవ్వగా అఖిల్ ని అనుకున్నారు కానీ తర్వాత విశ్వక్ సేన్ రేసులోకి వచ్చాడు. ముందు రీమేక్ చేయను అన్నా కానీ PVP ఒప్పించారని సమాచారం… కానీ రీమేక్ కి విశ్వక్ సేన్…
రెమ్యునరేషన్ పెంచేశారని అంటున్నారు. ఇది వరకు సినిమాలకు రెమ్యునరేషన్ కింద 1 కోటి రేంజ్ లో తీసుకునే ఈ యంగ్ హీరో… ఇప్పుడు ఈ రీమేక్ కి ఏకంగా 2 కోట్లు డిమాండ్ చేస్తున్నారని సమాచారం… దాంతో నిర్మాత ముందు ఖంగు తిన్నా ఓకే చెప్పారని అంటున్నారు కానీ ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది..
సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగి ఓకే అయితే ఇయర్ ఎండ్ కి మొదలు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు… ఇప్పటికే రెండు వరుస హిట్స్ కొట్టి జోరు మీదున్న విశ్వక్ సేన్ ఈ రీమేక్ కూడా ఓకే చేసి సినిమా కంప్లీట్ చేస్తే మరో హిట్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…