Home న్యూస్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ పక్కా….విశ్వక్ సేన్ రేంజ్ మారబోతుందిగా!

కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ పక్కా….విశ్వక్ సేన్ రేంజ్ మారబోతుందిగా!

0

టాలీవుడ్ యంగ్ హీరోలలో సినిమా సినిమాకి తన మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నాలు స్టడీగా చేస్తూ మంచి రిజల్ట్ లను కూడా సొంతం చేసుకుంటున్న వాళ్ళలో ముందు నిలిచే హీరో విశ్వక్ సేన్(Vishwak Sen)…లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాస్ కా ధమ్కీ తో మంచి విజయాన్ని సొంతం చేసుకోగా ఈ ఇయర్ గామి లాంటి ఎక్స్ పెరిమెంటల్ మూవీతో…

కూడా కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari Movie) సినిమా ఈ నెల ఎండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ లో మాస్ ఎలిమెంట్స్, మాస్ మూమెంట్స్ ఓవరాల్ ట్రైలర్ కట్…

ఆడియన్స్ లో మంచి బజ్ ను సినిమా మీద ఏర్పడేలా చేసింది అని చెప్పాలి. దాంతో మే 31 వీకెండ్ లో రిలీజ్ అవుతున్న మూవీస్ లో ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ హాట్ ఫేవరేట్ గా రిలీజ్ కానుండగా టాక్ ఎలా ఉన్నా కూడా సినిమా మీద బిల్డ్ అవుతున్న బజ్ చూస్తూ ఉంటే…

విశ్వక్ సేన్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. దాస్ కా ధమ్కీ 3 కోట్ల రేంజ్ లో గామి 3 కోట్ల లోపు ఓపెనింగ్స్ ను మొదటి రోజు అందుకోగా ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా టాక్ మినిమమ్ ఓకే అనిపించేలా ఉన్నా కూడా మొదటి రోజు అవలీలగా…

3.5-4 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. టాక్ ఏమాత్రం సూపర్ పాజిటివ్ గా ఉన్నా అంచనాలను మించిపోయే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఎక్స్ పెర్టేషన్స్ ను ఎంతవరకు మించిపోతుందో చూడాలి ఇక….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here