Home న్యూస్ లవ్ మీ 1st డే కలెక్షన్స్…మిక్సుడ్ టాక్ తో కూడా కుమ్మేసిందిగా!

లవ్ మీ 1st డే కలెక్షన్స్…మిక్సుడ్ టాక్ తో కూడా కుమ్మేసిందిగా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు దిల్ రాజు(Dil Raju) తమ్ముడి కొడుకు ఆశిష్(Ashish) హీరోగా నటించిన రెండో సినిమా లవ్ మీ(Love Me Movie) మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. సినిమా ట్రైలర్ లో కాన్సెప్ట్ యూనిక్ గా అనిపించడంతో ఆడియన్స్ లో బజ్ అయితే పెరిగిపోయింది కానీ…

తీరా రిలీజ్ అయిన తర్వాత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి ఆటకే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది…ఇక కలెక్షన్స్ ఎలా వస్తాయి అనుకున్నా కూడా బుక్ మై షోలో మొదటి రోజున ఆల్ మోస్ట్ 25 వేలకు పైగా టికెట్ సేల్స్ జరగగా డీసెంట్ షేర్స్ ని అన్ని ఏరియాల్లో సొంతం చేసుకుంది ఈ సినిమా…

Love Me Movie 1st Day Box Office Collections Report
మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే మొదటి రోజున తెలుగు రాష్ట్రాల్లో సినిమా 85 లక్షలకు అటూ ఇటూగా షేర్ ని సొంతం చేసుకుందని అంచనా….వరల్డ్ వైడ్ గా 1 కోటి రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకుందని అంచనా…వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క 2.20 కోట్ల రేంజ్ దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు…

ఓవరాల్ గా సినిమాకి మొదటి ఆటకి వచ్చిన టాక్ కి ప్రస్తుతం టాలీవుడ్ ఉన్న పరిస్థితికి ఇవి మంచి కలెక్షన్స్ అనే చెప్పాలి. ఇక సినిమా వాల్యూ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్ 6 కోట్ల దాకా ఉంటుదని అంచనా…సినిమా వీకెండ్ లో ఇలానే జోరుని చూపించి తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ ని చూపిస్తే వాల్యూ బిజినెస్ ను అందుకోవచ్చు కానీ దానికి సినిమా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here