Home న్యూస్ ఈ రేంజ్ లో ట్రోల్స్ ఏంటి సామి….ఊహించలేదు ఇది ఎవ్వరూ!!

ఈ రేంజ్ లో ట్రోల్స్ ఏంటి సామి….ఊహించలేదు ఇది ఎవ్వరూ!!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర (Vishwambhara Teaser) సినిమా ఆడియన్స్ ముందుకు అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సింది కానీ, షూటింగ్ అయిపోయినా కూడా రామ్ చరణ్(Ram Charan) గేమ్ చేంజర్(Game Changer) సినిమా కోసం…

ఇప్పుడు విశ్వంభర సినిమాను వచ్చే సమ్మర్ కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. ఇక సినిమా అఫీషియల్ టీసర్ ను అయితే దసరా కానుకగా రీసెంట్ గా రిలీజ్ చేయగా టీసర్ కి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా కామన్ ఆడియన్స్ నుండి ఇతర హీరోల ఫ్యాన్స్ నుండి మాత్రం….

మిక్సుడ్ టు కంప్లీట్ నెగటివ్ రెస్పాన్స్ ఉంది, ముఖ్యంగా సోషల్ మీడియా అంతటా కూడా సినిమా టీసర్ మీద ఇతర హీరోల ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రోల్స్ ని వేస్తున్నారు….రీసెంట్ టైంలో ఇతర హీరోల ఫ్యాన్స్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ట్రైలర్ లో గ్రాఫిక్స్ క్వాలిటీ…

ఏమాత్రం బాలేవు అంటూ గట్టిగానే ట్రోల్ చేశారు…ఇప్పుడు దానికి రివేంజ్ అన్నట్లు మరింతగా నెగటివ్ టు ఎక్స్ ట్రీం నెగటివ్ ట్రోల్స్ సోషల్ మీడియాలో విశ్వంభర టీసర్ పై పడుతున్నాయి….సినిమా అనౌన్స్ మెంట్ నుండి కూడా యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకున్న ఈ సినిమా…

టీసర్ విషయంలో నిరాశ కలిగించే అంశాలు బ్యాగ్రౌండ్ స్కోర్ ఏమాత్రం ఎఫెక్టివ్ గా లేక పోవడం, అలాగే కొన్ని చోట్ల గ్రాఫిక్స్ క్వాలిటీ కొంచం నాసిరకంగా అనిపించడం, రిలీజ్ ఎలాగూ ఇప్పుడు వచ్చే సమ్మర్ కి పోస్ట్ పోన్ అవ్వడంతో మేకర్స్ ఇంకా ఆల్ మోస్ట్…

6 నెలల టైం ఉంది కాబట్టి వీటి మీద మరింత ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కానీ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో సినిమా టీసర్ మీద ఊహించిన దానికి డబుల్ అనిపించే రేంజ్ లో ట్రోల్స్ ఉన్నాయి, ఇవన్నీ తట్టుకుని మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాతో ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here