Home న్యూస్ ఈ టాక్ కే ఇలా కొడితే….హిట్ టాక్ పడి ఉంటేనా!!

ఈ టాక్ కే ఇలా కొడితే….హిట్ టాక్ పడి ఉంటేనా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతున్న హీరోలలో టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్(Gopichand) ఒకరు. ఒకప్పుడు మంచి మాస్ మూవీస్ తో మంచి మార్కెట్ ను సొంతం చేసుకున్న గోపీచంద్ తర్వాత టైంలో అనుకున్న రేంజ్ లో హిట్స్ లేక పోవడంతో తన మార్కెట్ ను కోల్పోతూ వచ్చాడు…

2014 టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర లౌక్యం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న గోపీచంద్ కి తర్వాత ఇప్పటి వరకు క్లీన్ హిట్ అయితే పడలేదు…అడపాదడపా మధ్యలో కొన్ని పర్వాలేదు అనిపించే సినిమాలు వచ్చినా కూడా సరైన హిట్ అయితే పడలేదు…

ఇక ఈ మధ్య గోపీచంద్ నటించిన సినిమాలు మినిమమ్ ఓపెనింగ్స్ ను కూడా అందుకోలేక పోతున్నాయి. ఇక ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు భీమా మూవీతో వచ్చినా పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. ఇక లేటెస్ట్ గా గోపీచంద్ నటించిన విశ్వం మూవీ(Viswam Movie)…

దసరా టైంలో వచ్చి మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా ఏ దశలో కూడా తేరుకునే అవకాశం లేదు అనిపించినా కూడా ఓవరాల్ గా వాల్యూ టార్గెట్ 10 కోట్లకు పైగా ఉండగా లాంగ్ రన్ లో 80% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకోబోతున్న ఈ సినిమా…

మిక్సుడ్ టాక్ తో కూడా ఓవరాల్ గా మంచి రికవరీనే సొంతం చేసుకుంది. అదే సినిమాకి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రివ్యూలు కనుక సొంతం అయ్యి ఉంటే కచ్చితంగా కలెక్షన్స్ ఇంకా ఎక్కువ గానే సొంతం అయ్యి ఉండేవి అని చెప్పొచ్చు…. ఇంకా పోటి లేకుండా రిలీజ్ అయ్యి ఉంటే…

ఈజీగా సినిమా బ్రేక్ ఈవెన్ ని కూడా అందుకుని ఉండేది….ఈ సినిమా మాస్ సెంటర్స్ లో ఇప్పటికీ జనాలను రప్పిస్తూ ఉండటంతో ఆఫ్ లైన్ గోపీచంద్ కి ఇప్పటికీ మార్కెట్ ఎంతో కొంత ఉందని రుజువు అయ్యింది. సరైన సినిమా పడాల్సిన అవసరం ఉంది గోపీచంద్. అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here