బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతున్న గోపీచంద్(Gopichand) మరియు శ్రీనువైట్ల(Sreenu Vaitla) ల కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ విశ్వం(Viswam Movie Review Rating) తో కంబ్యాక్ ను ఎక్స్ పెర్ట్ చేయగా భారీ లెవల్ లో దసరా కానుకగా రిలీజ్ అయిన ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…
కథ పాయింట్ విషయానికి వస్తే సిటీలో వరుసగా బాంబ్ బ్లాస్టులు జరుగాయి. ఈ క్రమంలో ఒక మినిస్టర్ కూడా చనిపోతాడు…కానీ మినిస్టర్ చనిపోవడం ఒక పాప చూస్తుంది…ఆ పాప ప్రాణాలకు ముప్పు ఉండగా హీరో ఆ పాపని కాపాడటానికి ఏం చేశాడు. ఈ క్రమంలో హీరోయిన్ తో లవ్ స్టోరీ ఏంటి…ఆ బాంబ్ బ్లాస్ట్ ల వెనక ఉన్నది ఎవరు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
ముందుగా సినిమా చూడాలి అనుకున్న ఆడియన్స్ ఇది ఫక్తు కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన శ్రీనువైట్ల దూకుడు-బాద్ షా టైప్ టెంప్లెట్ తో వచ్చిన ఎంటర్ టైనర్ అని గుర్తు పెట్టుకుని లాజిక్ లు వెతకకుండా బ్రెయిన్ ని ఇంట్లో పెట్టేసి థియేటర్స్ కి వెళితే మరీ బాగుంది అని కాదు కానీ…
పర్వాలేదు అనిపించేలా మెప్పించి కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకుని, కొన్ని చోట్ల యాక్టర్ పార్ట్ మెప్పించి, రెండు మూడు సాంగ్స్ ఆకట్టుకోవడంతో మాస్ ఆడియన్స్ ను కమర్షియల్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ ను పర్వాలేదు అనిపించేలా మెప్పిస్తుంది సినిమా…
రొటీన్ కథతోనే వచ్చిన విశ్వం మూవీలో గోపీచంద్ మరోసారి ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ తో మెప్పించగా కామెడీ, అండ్ యాక్షన్ సీన్స్ లో మెప్పించాడు…కొన్ని చోట్ల హీరోయిజం ఎలివేట్ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి… ఇక హీరోయిన్ కావ్య జస్ట్ ఓకే అనిపించగా… కామెడీ యాక్టర్స్ చాలా మందే ఉండగా కొన్ని చోట్ల కొందరు పర్వాలేదు అనిపించారు..
ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరమ రొటీన్ గా ఉండగా, కథ డ్రాగ్ అవ్వడం తర్వాత సీన్ ఏమవుతుంది అనేది ఆడియన్స్ ఈజీగా గెస్ చేసేలా ఉండటం మేజర్ డ్రా బ్యాక్స్, సంగీతం పర్వాలేదు అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది… సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా…
డైరెక్షన్స్ పరంగా శ్రీనువైట్ల ఇప్పటికీ 10 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులలోనే ఉన్నాడనిపించింది, కానీ అక్కడ కూడా కొన్ని చోట్ల తన మార్క్ కామెడీ సీన్స్ తో మెప్పించడం, యాక్షన్ బ్లాక్స్ ఆకట్టుకోవడంతో పర్వాలేదు అనిపించాడు, కానీ ప్రస్తుతం ఉన్న ఆడియన్స్ టేస్ట్ కి దూరంగానే సినిమా ఉంది….
కానీ ముందే చెప్పినట్లు ఇది ఫక్తు కమర్షియల్ శ్రీనువైట్ల టెంప్లెట్ లో తెరకెక్కిన సినిమా అని గుర్తు పెట్టుకుని ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్స్ కి వెళితే రీసెంట్ టైంలో వచ్చిన గోపీచంద్ అండ్ శ్రీనువైట్ల మూవీస్ తో పోల్చితే బెటర్ ఔట్ పుట్ తో…
తెరకెక్కిన సినిమాగా విశ్వం సినిమా నిలుస్తుంది అని చెప్పాలి. కానీ మాస్ అండ్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు కాకుండా కొత్తదనం కోరుకునే ఆడియన్స్, భారీ పాన్ ఇండియా మూవీస్ చూసి అవే రేంజ్ లో ఎక్స్ పెర్టేషన్స్ తో విశ్వంకి వెళితే నిరాశ కలుగుతుంది. ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్…