బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన ప్రతీ మూవీ హిట్ అవ్వాలని రూల్ ఏమి లేదు….కానీ ఒక సినిమాను హిట్ చేయడానికి టీం ఎంత కష్టపడాలో అంత కష్టపడతారు…పోస్టర్స్ లో ఎక్కువ కలెక్షన్స్ ని చూపించడం, విస్తృతంగా సినిమాను ప్రమోట్ చేసుకోవడం ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇవన్నీ సినిమాను జనాల లోకి తీసుకు వెళ్ళడానికి చేసే పనులు…
రీసెంట్ టైం చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతీ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ కన్నా పోస్టర్స్ లో ఎక్కువ కలెక్షన్స్ ని వేయడం పరిపాటిగా మారిపోయింది….నిర్మాతలు కూడా ఫ్యాన్స్ కోసం మేం ఆ పోస్టర్స్ ను వేస్తున్నాం, నమ్మితే నమ్మండి లేకుంటే ఊరుకోండి అంటూ ఓపెన్ గానే చెబుతున్నారు…
ఇక లేటెస్ట్ గా దసరా పోటిలో రిలీజ్ అయిన గోపీచంద్(Gopichand) నటించిన విశ్వం(Viswam Movie) విషయంలో టీం మరో రెండు మూడు స్టెప్స్ ఎక్కువే వేసేలా ప్రమోట్ చేసుకుంటున్నారు.. మొదటి రోజే సినిమా హాల్ఫ్ బిజినెస్ ను రికవరీ చేసిందని పోస్టర్ వేసుకున్నారు…
రెండో రోజే సినిమా టోటల్ బిజినెస్ ను రికవరీ చేసిందని పోస్టర్ వేసి సినిమా హిట్ అనిపించుకున్నారు. కట్ చేస్తే మొదటి వారంలో వాల్యూ టార్గెట్ 10 కోట్లలో సగానికి అటూ ఇటూగానే రికవరీని సినిమా సొంతం చేసుకోబోతుంది. ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక పట్టుమని 6 కోట్లు కూడా కలెక్షన్స్ రాని సినిమాకి సక్సెస్ మీట్ పెట్టి టీం అంతా ఎంజాయ్ చేశారు….అది మరింతగా ఆశ్యర్యపరిచింది అందరినీ కూడా…అంతటితో కూడా ఆగకుండా సినిమాలో నటించిన సీనియర్ యాక్టర్ నరేష్ ఏకంగా మైకులో విశ్వం మూవీ…
2024 ఇయర్ లోనే టాలీవుడ్ లో వచ్చిన మూవీస్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ అంటూ చెప్పుకొచ్చారు. అది ఏ ఉద్దేశ్యంతో అన్నారో కానీ అసలు ఇంతలా సినిమా సక్సెస్ అనిపించుకోవడానికి టీం పడుతున్న కష్టం చూసి మెచ్చుకుంటూనే, వాళ్ళు ఎంచుకున్న రూట్ చేసి సోషల్ మీడియాలో నవ్వుకునే పరిస్థితి వచ్చింది…కానీ రియాలిటీ దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది…
అరె బాబు గోపీ చంద్ మూవీ కాబట్టి రాసవ్… బ్రాండ్ హీరోస్ మూవీ కి కూడా ఇలాగే రాస్తారు… వాళ్ళకి ఒక నాయం …. నువు చెప్పేది తప్పు కాదు.. ఇలా రాయడం తప్పు…
Cinema collections producer chepthaadu, nuvvu velli count cheseva collections