నట సింహం నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చేసిన సినిమా వీర సింహా రెడ్డి ఆడియన్స్ ముందుకు ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో పోటిలో రిలీజ్ అవ్వగా ఓపెనింగ్ డే వరకు ఫుల్ డామినేట్ చేసినా కానీ తర్వాత మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో డౌన్ అయిన సినిమా లాంగ్ రన్ లో బాలయ్య కెరీర్ లో నంబర్ 1 షేర్ మూవీ అయిన అఖండ సినిమా…
టోటల్ కలెక్షన్స్ ని క్రాస్ చేసి బాలయ్య కెరీర్ లో 79.82 కోట్ల షేర్ ని అందుకుని ఆల్ టైం హైయెస్ట్ షేర్ వసూళ్ళని సాధించిన సినిమాగా సంచలనం సృష్టించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర 54 డైరెక్ట్ మరియు షిఫ్ట్ సెంటర్స్ లో 50 రోజుల వేడుకని జరుపుకున్న ఈ సినిమా..
ఇప్పుడు ఏప్రిల్ 21న తేదీ నాటికి 100 రోజులను పూర్తీ చేసుకోబోతుంది. మొత్తం మీద 8 డైరెక్ట్-షిఫ్ట్ సెంటర్ లో సినిమా ఇప్పుడు 100 రోజులను పూర్తీ చేసుకోబోతుంది. మొత్తం మీద కంటెంట్ పరంగా అఖండ రేంజ్ లో లేక పోయినా కానీ…
వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 100 రోజులను పూర్తీ చేసుకోవడం విశేషం అని చెప్పాలి. ఇక బాలయ్య వీర సింహా రెడ్డి హిట్ తర్వాత అనిల్ రావిపూడితో తన కొత్త సినిమా చేస్తుండగా దసరాకి ఆ సినిమా బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగబోతుంది.
Congratulations to BALA KRISHNA garu.