Home న్యూస్ మంచి సినిమా…కానీ కలెక్షన్స్ పరిస్థితి ఇదే!!

మంచి సినిమా…కానీ కలెక్షన్స్ పరిస్థితి ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో టోటల్ గా 3 సినిమాలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో సమంత శాకుంతలం మరియు లారెన్స్ రుద్రుడు సినిమాలకు నెగటివ్ టాక్ లభించగా ఒకరోజు లేట్ గా రిలీజ్ అయిన మరో డబ్బింగ్ మూవీ విడుదల పార్ట్ 1 సినిమాకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అయ్యిందని చెప్పాలి. తొలిరోజు కలెక్షన్స్ కూడా 1.05 కోట్ల దాకా సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక తర్వాత రోజుల్లో…

మంచి జోరుని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపిస్తుంది అని అందరూ అనుకున్నారు కానీ సండే రోజు 60 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా మిగిలిన వర్కింగ్ డేస్ లో ఇప్పటి వరకు మరో 25 లక్షల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

దాంతో టోటల్ గా 4 రోజులకు గాను సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అటూ ఇటూగా 1.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని చెబుతూ ఉండగా ఇందులో నుండి వర్త్ షేర్ అటూ ఇటూగా 80 లక్షల రేంజ్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు…

సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 1.6 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఆ లెక్కన క్లీన్ హిట్ కి మినిమమ్ 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ కూడా వర్కింగ్ డేస్ లో తమిళ్ ఫ్లేవర్ మరీ ఎక్కువగా ఉన్న ఈ సినిమాను జనాలు అనుకున్న రేంజ్ లో ఆదరించడం లేదు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here