Home TRP రేటింగ్ బాలయ్య వీర సింహా రెడ్డి TRP రేటింగ్…ఎంత వచ్చిందంటే!!

బాలయ్య వీర సింహా రెడ్డి TRP రేటింగ్…ఎంత వచ్చిందంటే!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా సంక్రాంతి బరిలోకి దిగిన సినిమా పోటిలో ఉన్న చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో పోటిలో ఓపెనింగ్ డే పరంగా లీడ్ ని చూపించినా తర్వాత టాక్ ఇంపాక్ట్ వలన స్లో అయినా కూడా పండగ అడ్వాంటేజ్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని…

సొంతం చేసుకుని దుమ్ము లేపగా… టోటల్ రన్ లో 79.82 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని హిట్ గా నిలిచింది. సినిమా తర్వాత డిజిటల్ లో కూడా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకోగా రీసెంట్ గా సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ అయింది.

స్టార్ మా ఛానెల్ రిలీజ్ కి ముందే భారీ రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకోగా సినిమాను రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయింది. కాగా మొదటి సారి సినిమా టెలికాస్ట్ అయినప్పుడు మొత్తం మీద 8.83 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుంది…

ఓవరాల్ గా సినిమాకి వచ్చిన టాక్ దృశ్యా ఇది డీసెంట్ రేటింగ్ అనే చెప్పాలి కానీ ఓవరాల్ గా బాలయ్య ప్రీవియస్ మూవీ అఖండ 13.31 టి.ఆర్.పి తో పోల్చితే మాత్రం యావరేజ్ రేంజ్ లోనే రేటింగ్ ను సొంతం చేసుకుందని చెప్పాలి. అయినా కానీ ఉన్నంతలో మరీ నిరాశకలిగించే రిజల్ట్ అయితే కాదని చెప్పొచ్చు. కానీ ఛానెల్ కి లాభాలు రావాలి అంటే టెలివిజన్ లో లాంగ్ రన్ లో ఇలానే హోల్డ్ చేయాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here