అందరి ఫామ్ ఎప్పుడూ సక్సెస్ లోనే ఉండదు… ఒకప్పుడు టాప్ అనుకున్న వాళ్ళు ఫాం కోల్పోయిన సందర్బాలు అనేకం ఉన్నాయి…టాలీవుడ్ లో ఒకప్పుడు రాజమౌళి తర్వాత సెకెండ్ ర్యాంక్ అందుకున్న డైరెక్టర్ వి వి వినాయక్. కమర్షియల్ మూవీస్ తో సినిమా సినిమా కి తన రేంజ్ ని పెంచుకున్న వినాయక్ రీసెంట్ టైం లో ఫాం మొత్తం కోల్పోయాడు… అల్లుడు శీను సినిమా హిట్ టాక్ ఉన్నా కమర్షియల్ ఫ్లాఫ్…
తర్వాత అఖిల్ లాంచ్ మూవీ తో పూర్తిగా డీలా పడ్డ తర్వాత అనుకోకుండా మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 తో ఇండస్ట్రీ హిట్ దక్కగా ఆ క్రెడిట్ ఎక్కువగా చిరుకే వెళ్ళినా డైరెక్ట్ చేసినందుకు వినాయక్ కి కూడా పేరు రాగా తర్వాత చేసిన ఇంటెలిజెంట్ అట్టర్ డిసాస్టర్ అయ్యి ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాడు.
ఇదే సమయంలో రీసెంట్ గా చిరంజీవి మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ తెలుగు రీమేక్ ని సాహో డైరెక్టర్ సుజిత్ కి అప్పగించగా చిరు మెచ్చే రేంజ్ లో మార్పులు చేర్పులు చేయలేక పోయాడు సుజిత్.. దాంతో ఇక ఈ ప్రాజెక్ట్ ఆపేద్దాం అనుకున్న చిరుకు…
సడెన్ గా వినాయక్ గుర్తు రాగా ఒక మాటగా ఇలా రీమేక్ అనుకుంటున్నాం నీకు నచ్చిన మార్పులు చేర్పులు చేయగలవా అని చిరు అడగగం వినాయక్ ఒప్పుకోవడం జరిగింది అని లేటెస్ట్ టాక్. ప్రస్తుతం వినాయక్ అదే పనిలో ఉన్నారని అంటున్నారు. మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉన్న టైం లో ఏకంగా చిరు తోనే మళ్ళీ సినిమా చేసే….
అవకాశం దక్కడంతో తన కమర్షియల్ మూవీ మ్యాజిక్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట. త్వరలోనే మార్పులతో కూడిన కథని వినిపిస్తారని అంటున్నారు. ఒకవేళ చిరు ఓకే అంటే ఆచార్య తర్వాత ఈ సినిమా ఉంటుందని, కథ నచ్చక పొతే… బాబీ డైరెక్షన్ లో మూవీ ఉంటుందని అన్నది లేటెస్ట్ ఇండస్ట్రీ న్యూస్…