మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ సినిమా రన్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలుస్తుంది, దానికి కారణం అందరికీ తెలిసిందే. కాగా సినిమా నష్టాలను బరిస్తూ 5 కోట్లు రిటర్న్ ఇవ్వాలని హీరో నిర్మాత కోరగా దర్శకుడు వద్దు ఇవ్వను అనడం తర్వాత నిర్మాత మరియు దర్శకుడి కి మధ్య మాటల యుద్ధం జరగడం తో ఇది పెరుగు తూ వెళ్ళింది.
తర్వాత సినిమా లో ఇలాంటి సీన్స్ ని వద్దు అని హీరో నిర్మాత చెప్పినా దర్శకుడు ఒప్పుకోలేదని చెప్పగా గొడవ ను మళ్ళీ రాజేశారు. ఇక ఇప్పుడు సినిమా బడ్జెట్ కి సంభందించిన న్యూస్ కూడా బయట పడింది అంటున్నారు. సినిమా కి బోయపాటి ఏకంగా 90 కోట్ల రేంజ్ లో…
బడ్జెట్ పెట్టించాడని ఇప్పుడు సరికొత్త వాదన వినిపిస్తుంది, ఇందులో రామ్ చరణ్ రెమ్యూనరేషన్ కింద 20 కోట్లు, బోయపాటి కి రెమ్యునరేషన్ కింద 15 కోట్లు, విలన్, హీరోయిన్ ఇతర యాక్టర్స్ కలిపి మరో 5 కోట్లు రెమ్యూనరేషన్ వెళ్ళగా సాంకేతిక వర్గం కి మొత్తం మీద 5 కోట్ల దాకా రెమ్యూనరేషన్ వెళ్లిందని సమాచారం.
ఇవే మొత్తం మీద 45 కోట్ల దాకా అవ్వగా సినిమా ను సుమారు 45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాడట. ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియదు కానీ అంత బడ్జెట్ ఏ సీన్స్ కి అయిందో ఎవ్వరికీ అంతు పట్టడం లేదు ఇప్పుడు, బహుశా ఆ గ్రాఫిక్స్ వర్క్ కి… ఎక్కువ
మొత్తం వెళ్లి ఉండొచ్చని అంటున్నారట. మొత్తం మీద సినిమా రిలీజ్ తర్వాత ఇలాంటి వాగ్వివాదాలతో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది, ఈ సినిమా తర్వాత ఇక బోయపాటి మెగా హీరోల కి దూరం అవ్వడం ఖాయమని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.