బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా అలాగే నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీర సింహా రెడ్డి సినిమాలు పోటి పడుతున్న విషయం తెలిసిందే. రెండు సినిమాలను కూడా ఒకే నిర్మాత నిర్మించినప్పటికీ బాలయ్య తన సినిమా సంక్రాంతికే రావాలని డిసైడ్ అవ్వడంతో చేసేదేమీ లేక ఇప్పుడు ఒకే ప్రొడక్షన్ హౌస్ నుండి రూపొందిన 2 బిగ్ స్టార్ మూవీస్ ఇప్పుడు ఒకేసారి…
బాక్స్ ఆఫీస్ దగ్గర పోటి పడటానికి సిద్ధం అవుతూ ఉండటం, బిజినెస్ డీల్స్ ని కూడా మొదలు పెట్టడం స్టార్ట్ చేయడంతో బయ్యర్లు అంత పోటిలో భారీ రేట్లు పెట్టి సినిమాలను కొనడానికి సిద్ధంగా లేరని సమాచారం. దానికి తోడూ పోటి లో…
ప్రభాస్ ఆది పురుష్ కూడా ఉండటంతో ఈ సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకునే అవకాశం కొద్ది వరకు ఉందని టాక్ ఉన్న నేపధ్యంలో అది జరిగితేనే భారీ రేట్లు ఇచ్చి చిరు అలాగే బాలయ్య సినిమాలను భారీ రేట్లకి కొనడానికి తాము సిద్ధం అని లేని పక్షంలో…
ఆది పురుష్ రిలీజ్ అయితే కచ్చితంగా 30% వరకు రేట్లు చిరు బాలయ్య సినిమాలవి తగ్గిస్తేనే సినిమాలను కొనడానికి తాము సిద్ధం అని కండీషన్ పెడుతున్నారట. దాంతో ఇంకా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. మరి ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.