టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఖైదీ నంబర్ 150 అవడానికి రీమేక్ అయినా చిరుకి పెర్ఫెక్ట్ రీ ఎంట్రీ గా వర్కౌట్ అయింది, తర్వాత చేసిన సైరా నరసింహా రెడ్డి పీరియాడికల్ మూవీనే అయినా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, ఇక తర్వాత చేసిన ఆచార్య ఎపిక్ డిసాస్టర్ తో పాటు ఫ్యాన్స్ ని కూడా మినిమమ్ సాటిస్ ఫై చేయలేకపోయింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన గాడ్ ఫాదర్….
ఫ్యాన్స్ ని సాటిస్ ఫై చేసినా కామన్ ఆడియన్స్ అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి రాలేదు. ఇలాంటి టైం లో వింటేజ్ మెగాస్టార్ ని గుర్తు చేస్తూ బాబీ డైరెక్షన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ సంక్రాంతికి రిలీజ్ ను మరోసారి కన్ఫాం చేసుకుంటూ ఇప్పుడు…
అఫీషియల్ టైటిల్ ని కూడా కన్ఫాం చేసుకుంది, వాల్తేరు వీరయ్యగా టైటిల్ ని కన్ఫాం చేసుకుంటూ రిలీజ్ చేసిన టైటిల్ ఇంట్రో టీసర్ వీడియో ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో కిక్ ఇవ్వగా కామన్ ఆడియన్స్ కి అలాగే రెగ్యులర్ ఆడియన్స్ కి వింటేజ్ చిరుని తిరిగి గుర్తు చేసింది…
బాబీ టేకింగ్, చిరు మాస్ అవతార్, టీసర్ ఎండ్ లో రవితేజ మాస్ వాయిస్ ఓవర్ అన్నీ ఓ రేంజ్ లో కిక్ ఇచ్చినా ఓ చిన్న మైనస్ పాయింట్ కూడా ఉంది, దేవి శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా ఏమాత్రం ఇంప్రెస్ చేయలేదు అని చెప్పాలి. ఇదొక్కటి యూనిట్ సరిచేసుకుంటే బాక్స్ ఆఫీస్ ఇక బద్దలు అవ్వడం ఖాయమని చెప్పాలి.