కింగ్ నాగార్జున నటించిన రీసెంట్ సోలో హీరో మూవీస్ లో ఎక్కువ శాతం నిరాశ పరిచే రిజల్ట్ నే సొంతం చేసుకున్నాయి. కానీ లేటెస్ట్ గా నాగార్జున చేసిన ది ఘోస్ట్ సినిమా కి ఉన్నంతలో మంచి టాకే లభించింది, కాగా సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ దృశ్యా అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక పోయింది అనే చెప్పాలి. కానీ అదే టైం లో రీసెంట్ గా గాడ్ ఫాదర్ మేకర్స్….
అనౌన్స్ చేసినట్లు అన్ని ఏరియాల్లో మేమే ఓన్ గా రిలీజ్ చేశాం అంటూ కామెంట్స్ చేయడం, సినిమా లాభాల్లో ఉందని చెప్పడం లాంటివి ట్రేడ్ కి కొంచం శాకిచ్చాయి అనే చెప్పాలి. ఏ సినిమాకి అయినా కొన్ని ఏరియాల్లో అడ్వాన్స్ బేస్ మీద ఓన్ గానే రిలీజ్ చేస్తూ ఉంటారు…
ఆ బిజినెస్ వాల్యూ ఓవరాల్ గా ఇంత ఉంటుందని, సినిమా ఇంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందని ట్రేడ్ అంచనా వేసి చెబుతారు. గాడ్ ఫాదర్ కి కొంచం సినిమాని ఎలాగైనా హిట్ చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉండగా అదే టైం లో ఓన్ రిలీజ్ గానే చాలా ఏరియాల్లో…
రిలీజ్ అయిన ది ఘోస్ట్ ని కూడా గాడ్ ఫాదర్ మాదిరిగానే హిట్ అని చెప్పొచ్చు… ఎందుకంటే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా పెట్టిన పెట్టుబడి మొత్తం రికవరీ అయింది, బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్వాన్స్ బేస్ మీదే సినిమా రిలీజ్ అవ్వగా ఓవరాల్ అన్ని వర్షన్స్ కలుపుకుని బిజినెస్ వాల్యూ ఇంత అని ట్రేడ్ లో చెప్పినప్పటికీ…
గాడ్ ఫాదర్ లా ఈ సినిమా కూడా నిర్మాతలకు ప్రాఫిటబుల్ అనే చెప్పాలి. కానీ నాగార్జున కానీ ది ఘోస్ట్ టీం కానీ సినిమా ఫేట్ ని జనాలకే వదిలివేయగా ఇప్పటి వరకు అయితే ఓపెన్ స్టేట్ మెంట్స్ లాంటివి ఏం పెట్టలేదు… ఈ విషయంలో నాగార్జునని మెచ్చుకోవాల్సిందే అంటూ చెబుతున్నారు విశ్లేషకులు…