బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమా వలన స్లో డౌన్ అయినా కూడా నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie)తో కెరీర్ లోనే హైయెస్ట్ షేర్ ని అయితే సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా….
సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ని పూర్తి చేసుకుని రీసెంట్ గా సినిమా డిజిటల్ లో రిలీజ్ అయింది. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన తర్వాత సినిమా కి వస్తున్న రెస్పాన్స్ రీసెంట్ టైంలో సీనియర్ హీరోల సినిమాల పరంగా ది బెస్ట్ అనిపించే రేంజ్ లో మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం…
అందునా బాలయ్య నటించిన మూవీస్ ఎక్కువగా ట్రోల్ స్టఫ్ అవుతూ ఉంటాయి కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఇతర ఇండస్ట్రీ ల ఆడియన్స్ కూడా ఓ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతూ మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం..
కాగా నెట్ ఫ్లిక్స్ లో సినిమా మొదటి వీక్ లో ఓ రేంజ్ లో సెన్సేషనల్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకోగా 2.4 మిలియన్ వ్యూస్ మార్క్ ని సొంతం చేసుకుని ఊరమాస్ ఊచకోత కోయగా…ఇదంతా మొదటి వారానికే ఉంటుంది, రెండో వీక్ లో స్లో డౌన్ అవుతుంది అనుకున్నా కూడా..
రెండో వీక్ లో మొదటి వారాన్ని మించి ఊచకోత కోసిన డాకు మహారాజ్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో రెండో వీక్ లో ఏకంగా 2.6 మిలియన్ వ్యూస్ మార్క్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఓవరాల్ గా ఫస్ట్ వీక్ ని మించి రెండో వీక్ లో ఈ రేంజ్ లో కుమ్మేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం కాగా డిజిటల్ లో లాంగ్ రన్ లో మరింతగా రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది.