Home న్యూస్ ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటేనా!!

ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటేనా!!

0

భారీ హైప్ తో వచ్చే సినిమాలు అంచనాలను తట్టుకోలేక పొతే సోషల్ మీడియా లో కానీ బయట కానీ ఆ సినిమా టాక్ సూపర్ హిట్ రేంజ్ టాక్ కి మించి నెగటివ్ టాక్ అంతటా స్ప్రెడ్ అవుతుంది, కానీ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతున్న ఈ సీజన్ లో అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు… అసలే సినిమాలు లేని టైం లో రిలీజ్ అయిన సినిమా టాక్ ఎలా ఉన్నా పర్వాలేదు…

కచ్చితంగా చూసి తీరాల్సిందే అని అంతా అనుకోవడం ఖాయం. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే జరుగుతుంది… నాచురల్ స్టార్ నాని కెరీర్ లో 25 వ సినిమా గా వచ్చిన వి మూవీ సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు రావాల్సిన సినిమా.  కానీ కరోనా ఎఫెక్ట్ వలన ఈ సినిమా….

పోస్ట్ పోన్ అయ్యి టాలీవుడ్ తరుపున డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయిన మొదటి పెద్ద సినిమాగా రాగా భారీ అంచనాలతో ఆడియన్స్ సినిమాను చూడగా ఎక్కువ మంది జనాలను సినిమా ఎక్కలేదు. సైకో థ్రిల్లర్ జానర్ అని చెప్పి సింపుల్ రివేంజ్ కథని ఎలాంటి ఆసక్తిలేకుండా తెరకెక్కించారు….

దాంతో అంచనాలను అందుకోలేక పోయిన సినిమా పై సోషల్ మీడియా లో నిన్నటి నుండి సాలిడ్ గా నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది, అన్ని మేజర్ వెబ్ సైట్స్ కూడా సినిమా కి నెగటివ్ రివ్యూలనే ఇచ్చాయి. దాంతో ఇప్పుడు విశ్లేషకులు ఒక మాట చెబుతున్నారు, సినిమా డిజిటల్ రిలీజ్ అయ్యి ఎవ్వరికీ పెద్దగా ఇబ్బంది కలిగించలేదు కానీ…

థియేటర్స్ లో భారీ బిజినెస్ ని సొంతం చేసుకుని రిలీజ్ అయ్యి ఉండి మొదటి రోజు ఇలాంటి టాక్ ని సొంతం చేసుకుని ఉంటె… సాలిడ్ దెబ్బ తగిలి ఉండేదని అభిప్రాయ పడుతున్నారు. అది కూడా నిజం అనే చెప్పాలి. దాదాపు 10 లో 9 సినిమాలు ఇలాంటి టాక్ రిలీజ్ అయ్యాక సొంతం చేసుకుంటే ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమా మాత్రం OTT రిలీజ్ వల్ల సేఫ్ అయ్యింది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here