ఖిలాడి అనే టైటిల్ మనకు రవితేజ సినిమా తో కొంచం ఎక్కువ పరిచయం కానీ మనకన్నా కూడా హిందీ ఆడియన్స్ కి ఖిలాడి టైటిల్ చాలా స్పెషల్, అక్షయ్ కుమార్ ని ముద్దుగా పిలుచుకోవడం ఒకటి అయితే హిందీ డబ్బింగ్ మూవీస్ కి చాలా వరకు ఖిలాడి అనే టైటిల్ పెట్టడం జరుగుతుంది, దాంతో ఈ టైటిల్ అక్కడ స్పెషల్ కాగా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి టైటిల్ కూడా….
క్యాచీగా ఉండటంతో ఇక్కడ విషయం ఎలా ఉన్నప్పటికీ కూడా హిందీ లో సినిమా టైటిల్ తో అడ్వాంటేజ్ ఉండి కచ్చితంగా క్లిక్ అవుతుందేమో అని అంతా అనుకున్నారు కానీ అలా ఏమి జరగలేదు అనే చెప్పాలి. దానికి తోడూ రవితేజ నటించిన సినిమాలకు హిందీ లో కూడా…
ఎప్పటి కప్పుడు మంచి వ్యూవర్ షిప్ లభించడంతో ఖిలాడి సినిమా కలెక్షన్స్ బాగా వస్తాయని అందరూ ఆశించారు కానీ అలా ఏమి జరగలేదు అనే చెప్పాలి ఖిలాడి సినిమా ఇప్పటి వరకు హిందీ లో ఓవరాల్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క 1.81 కోట్ల నెట్ కలెక్షన్స్ ని 2.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది…
ఇంత తక్కువ కలెక్షన్స్ అక్కడ అందుకోవడానికి మెయిన్ రీజన్ మేకర్స్ మినిమమ్ పబ్లిసిటీ కూడా చేయక పోవడం అనే చెప్పాలి. ఖిలాడి టైటిల్ అక్కడ ఎంత క్యాచీ టైటిలో తెలిసాక కూడా ఒక ప్రెస్ మీట్ లాంటివి లేవు, అది లేక పోయినా పోస్టర్స్ అయినా అన్ని చోట్లా వేసి ఉంటే హిందీ లో లెక్క వేరేలా ఉండేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పుష్ప విషయంలో టీం పబ్లిసిటీ ఏమి చేయకపోయినా కానీ…
పోస్టర్స్ మాత్రం నార్త్ సైడ్ మొత్తం థియేటర్స్ లో నింపేశారు…. అల్లు అర్జున్ నార్త్ క్రేజ్ కి తోడూ ఈ పోస్టర్స్ పబ్లిసిటీ వలెనే ఎక్కువ మందికి సినిమా రీచ్ అయ్యి ఇది అల్లు అర్జున్ మూవీ అని థియేటర్స్ కి వెళ్ళారు… రవితేజ ఖిలాడి విషయంలో కూడా ఇదే జరుగుతుంది అనుకున్నా అలా జరగక పోవడం వలెనే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటున్నారు అక్కడ విశ్లేషకులు…